IPL 2024 PBKS vs SRH Live: ఐపీఎల్ లీగ్ దశలో తన ఆఖరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్‌పై ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ గొప్పగా పోరాడి విజయం సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ ఆఖరి మ్యాచ్‌ను పరాజయంతో లీగ్‌కు వీడ్కోలు పలికింది. విజయంతో హైదరాబాద్ టాప్ 2 స్థానంలోకి దూసుకెళ్లింది.
Also Read: RCB Playoff: కోహ్లీని చూసి ఏడ్చేసిన అనుష్క శర్మ.. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరికతో కన్నీళ్లు
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచి పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభుసిమ్రాన్ సింగ్ 45 బంతులతో 71 పరుగులతో సత్తా చాటాడు. రీలి రౌసో (49), అథర్వ టైడే (46) త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకోగా.. జితేశ్ శర్మ (32) పర్వాలేదనిపించారు. కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు పంజాబ్ పరుగులకు అడ్డుకట్ట వేయలేకపోయారు. నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, విజయకాంత్ వియాస్ కాంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: IPL MI vs LSG: ముంబై ఇండియన్స్ అట్టర్ ప్లాప్ షో.. ఆఖరి మ్యాచ్‌లోనూ లక్నో చేతిలో చిత్తు
తమ రికార్డులను పరిశీలిస్తే ఈ మ్యాచ్‌లో సాధారణ లక్ష్యం అయినా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంత కష్టంగానే ఛేదించింది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులతో విజయం సాధించింది. బ్యాటింగ్ విధ్వంసం ట్రావిస్ హెడ్ తొలి బంతికే డకౌట్ కావడం హైదరాబాద్‌కు దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో హైదరాబాద్‌లో జోష్ తెప్పించాడు. 28 బంతుల్లో 66 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి (33), నితీశ్ కుమార్ రెడ్డి (37), హెన్రిచ్ క్లాసెన్ (42) పర్వాలేదనిపించారు. షాబాద్ అహ్మద్ (3), అబ్దుల్ సమద్ (11) కొంత పరుగులు రాబట్టగా..సాన్విర్ సింగ్ ఫోర్‌తో జట్టుకు విజయం అందించాడు. బౌలింగ్ విషయానికి వస్తే అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్ల చొప్పున తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
విజయం.. ఓటమితో ముగింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌ను పంజాబ్ కింగ్స్ ఓటమితో ముగించింది. 14 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 9 ఓటములతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ నిలిచింది. 8 విజయాలు 5 ఓటములు, ఒక మ్యాచ్ వర్షం రద్దుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి తిరుగులేదనిపించింది. లీగ్ దశను అద్భుతంగా ముగించిన హైదరాబాద్ క్వాలిఫయిర్ మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం పొందింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter