ఐపీఎల్‌లో ఎప్పటికీ నేనింతే: Virat Kohli

ప్రస్తుత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టాప్ క్లాస్ ప్లేయర్. కానీ కెప్టెన్‌గా నిరూపించుకోవాల్సి ఉంది. ఐపీఎల్ టోర్నీ నెగ్గలేదని కోహ్లీపై విమర్శలున్నాయి. ఈసారైనా ఆ అపవాదు పోగొట్టుకోవాలని కోహ్లీ, అతడి టీమ్ సిద్ధంగా ఉంది.

Last Updated : Aug 10, 2020, 01:29 PM IST
ఐపీఎల్‌లో ఎప్పటికీ నేనింతే: Virat Kohli

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లో కీలక ఆటగాళ్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు.  భారత క్రికెట్ జట్టులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న (Virat Kohli) కోహ్లీ దాదాపు దశాబ్దకాలం నుంచి ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. అయితే పటిష్టమైన బెంగళూరు జట్టు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 3 పర్యాయాలు ఫైనల్ చేరినా విజేతగా నిలవలేదు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శల వెల్లువ ప్రతి ఏడాది కొనసాగుతోంది. MS Dhoni: రాంచీ స్టేడియంలో ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్

సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 (IPL 2020) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తన వైఖరిని కోహ్లీ తెలిపాడు. తాను ఆర్సీబీని వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశాడు. ఫలితాలు ఎలాగున్నా ఆర్సీబీతోనే తన ప్రయాణమని సహచర క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పలు విషయాలు ప్రస్తావించాడు. 12 ఏళ్లుగా ఆర్సీబీతో తన ప్రయాణం అద్భుతంగా కొనసాగిందన్నాడు. IPL ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలు 
MS Dhoni ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువరాజ్ సింగ్

ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీ కోరిక ఒక్కటే ఐపీఎల్ టైటిల్ సాధించడం. స్వదేశంలో ఎలాగూ కలిసిరాలేదని, విదేశాల్లోనైనా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కోహ్లీ భావిస్తున్నాడు. బెంగళూరు జట్టును వీడాలనే ఆలోచన కూడా తనకు రాలేదన్నాడు. మా ప్రదర్శన ఎలా ఉన్నా అభిమానులు మాపై ప్రేమను చూపిస్తున్నారని, ఐపీఎల్ ఉన్నంతవరకూ ఆర్సీబీలోనే కొనసాగుతానని కోహ్లీ పేర్కొన్నాడు. 177 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ.. 5,412 ఐపీఎల్ పరుగులు సాధించాడు.  RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు 
హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 

Trending News