Virat Kohli: అందుకే ఓడిపోయాం.. ఇక వారికి గ్యారంటీ ఇవ్వలేం! 30-45 నిమిషాల్లోనే మ్యాచులను కోల్పోతున్నాం: కోహ్లీ

కేప్‌టౌన్ టెస్టు మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 08:21 AM IST
  • అందుకే ఓడిపోయాం
  • సిరీస్ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది
  • 30-45 నిమిషాల్లోనే మ్యాచులను కోల్పోతున్నాం
Virat Kohli: అందుకే ఓడిపోయాం.. ఇక వారికి గ్యారంటీ ఇవ్వలేం! 30-45 నిమిషాల్లోనే మ్యాచులను కోల్పోతున్నాం: కోహ్లీ

Virat Kohli says We lost Test series due to bad batting: దక్షిణాఫ్రికా (South Africa) గడ్డపై టెస్టు సిరీస్‌ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియా (India)కి మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్‌ సాధించి చిరకాల విజయం అందుకోవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. శుక్రవారం ముగిసిన కేప్‌టౌన్ టెస్టు (Cape Town Test)లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మాట్లాడుతూ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. 

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఈ టెస్టు సిరీస్‌ గొప్పగా సాగింది. టెస్ట్ క్రికెట్‌లో ఇది గొప్ప పోరాటం నేను భావిస్తున్నాను. తొలి టెస్టులో మేం మెరుగ్గా రాణించి పై చేయి సాధించాం. దక్షిణాఫ్రికా రెండో టెస్టులో గొప్పగా పుంజుకుని విజయం సాధించింది. మూడవ గేమ్‌లో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. కీలక సమయాల్లో మా ఆటగాళ్లు విఫలమయ్యారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న దక్షిణాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. విజయానికి ఆతిథ్య జట్టు ప్లేయర్స్ పూర్తి అర్హులు' అని అన్నాడు. 

Also Read: Today Horoscope January 15 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన నష్టం తప్పదు!!

'విదేశాల్లో పర్యటించడం పెద్ద సవాల్. అయినా కూడా చాలా మ్యాచులను గెలిచాము. అయితే మా 30-45 నిమిషాల బ్యాటింగ్ కారణంగా చాలా మ్యాచ్‌లను కోల్పోయాము. ఈ పర్యటనలో కీలక సమయాల్లో మా ఆటగాళ్లు విఫలమయ్యారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న దక్షిణాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. మా కంటే మెరుగ్గా రాణించింది. వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడంతో మేం కొంచెం వెనుకబడిపోయాం. మరోవైపు కీలక సమయాల్లో బౌలర్లు కూడా విఫలమవడంతో ఇక పుంజుకోలేకపోయాం. అది చాలా నిరాశకు గురి చేసింది' అని విరాట్ కోహ్లీ తెలిపాడు. 

'దక్షిణాఫ్రికా బౌలర్లు స్థిరత్వంతో బౌలింగ్‌ చేసి భారత్‌ని దెబ్బతీశారు. ప్రతిఒక్కరు పక్కా ప్రణాళికతో వచ్చి బ్యాటర్లను ఒత్తిడికి గురి చేశారు. మా బ్యాటింగ్‌ ఆర్డర్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. బెంచ్‌లో మంచి ప్లేయర్స్ ఉన్నారు. వరుసగా విఫలమవుతున్న వారికి చోటు కష్టం కానుంది. గత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో మెరుగ్గా రాణించినంత మాత్రాన దక్షిణాఫ్రికాలో అదే విధంగా రాణిస్తామని గ్యారంటీ ఇవ్వలేం' అని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Kohli Interview) చెప్పుకొచ్చాడు.

Also Read: ISRO new chief: సోమ​నాథ్​కు ఇస్రో పగ్గాలు.. ముగిసిన శివన్​ శకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News