Ind vs Pak: భారత్, పాక్ మ్యాచ్‌కు కౌంట్ డౌన్ మొదలు..తాజాగా మరో వీడియో వైరల్..!

Ind vs Pak: ఆసియా కప్ 2022 హడావిడి మొదలైంది. భారత్, పాకిస్థాన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 9, 2022, 06:50 PM IST
  • ఆసియా కప్ 2022
  • భారత్, పాక్ మ్యాచ్‌ కౌంట్ డౌన్
  • వైరల్‌గా మారుతున్న వీడియోలు
Ind vs Pak: భారత్, పాక్ మ్యాచ్‌కు కౌంట్ డౌన్ మొదలు..తాజాగా మరో వీడియో వైరల్..!

Ind vs Pak: భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే యావత్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఆసియా కప్‌ 2022లో భాగంగా ఈనెల 28న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్‌ మరింత రసవత్తరంగా సాగనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను పాక్ 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీనికి ప్రతికారం తీర్చుకోవాలని భారత క్రికెట్ జట్టు భావిస్తోంది.

ఈసారి కెప్టెన్ మారడం భారత్ కలిసి వస్తుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఈనెలాఖరులో యూఏఈ వేదికగా ఆసియాకప్‌ 2022 ప్రారంభంకానుంది. భారత్, పాక్ జట్లు బాగా ఆడితే ఇదే టోర్నీలో మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇరుదేశాల అభిమానులకు పండుగ కానుంది. మొత్తంగా త్వరలో మ్యాచ్ ప్రారంభంకానునడంతో ప్రసార ఛానల్ స్టార్ స్పోర్ట్స్‌ వరుసగా ప్రోమోలను విడుదల చేస్తోంది.

తాజాగా రోహిత్ శర్మ, బాబర్ అజామ్, షాహీన్ ఆఫ్రిదితో కలిపి వీడియోను తయారు చేసింది. ఇందులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ..ఆఫ్రిది బౌలింగ్ సిద్ధమవుతూ..బాబర్ అజాం ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. వీడియోలో పిచ్‌పై ఉన్న లైన్‌ను రోహిత్ శర్మ చూస్తూ కనిపించాడు. ఈఏడాది ఎలాగైన కప్ కొట్టి 8వ సారి టైటిల్ తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా యోచిస్తోంది.

ఈనెల 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్ కప్ టార్గెట్‌గా టీమ్‌ను తయారు చేస్తున్నారు. ఆసియా కప్‌కు ఫామ్‌లోలేని స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. వీరు ఫామ్‌లోకి వస్తే టీ20 ప్రపంచకప్‌ ఖాయంగా కనిపిస్తోంది.

గాయం కారణంగా బుమ్రా, హర్షల్ పటేల్‌ జట్టుకు దూరమయ్యారు. వీరు తిరిగి టీ20 ప్రపంచకప్‌కు జట్టులోకి వస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ జట్టు ప్రదర్శన ఆధ్వాన్నంగా ఉంది. దీంతో ఆసియా కప్‌ను కొట్టి..ఆ కసిని తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఆసియా కప్‌ను గెలుచుని ..అదే స్ఫూర్తితో వరల్డ్ కప్‌కు వెళ్లాలని కోచ్ రాహుల్ ద్రావిడ్ స్కెచ్‌లు వేస్తున్నారు.

Also read:AP Model School Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..రాత పరీక్ష లేకుండానే పోస్టుల భర్తీ..!

Also read:Rain Alert Live Updates: ముంచుకొస్తున్న వాయు'గండం'..తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News