India Vs England Highlights: వరుసగా రెండు టెస్ట్ సిరీస్‌లో ఓడిపోవడంతో నిరాశలో ఉన్న అభిమానులకు మళ్లీ ఉత్సాహం తెప్పించేలా కుర్రాళ్లు దంచికొట్టారు. తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ స్కోర్ 132 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 34 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో చెలరేగి 79 పరుగులు చేశాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేయడం విశేషం. దీంతో కేవలం 12.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌లో సిరీస్ టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 25న చెన్నై వేదికగా జరగనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభం నుంచే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలో నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించాడు. ఓపెనర్లు సాల్ట్ (0), డకెట్ (4)ను త్వరగా పెవిలియన్‌కు పంపించాడు. ఆ తరువాత కెప్టెన్ జోస్ బట్లర్ (44 బంతుల్లో 68, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓ ఎండ్‌లో దూకుడుగా ఆడగా.. హ్యారీ బ్రూక్ (17) కాసేపు సహకారం అందించాడు. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 4.1 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. సంజు శాంసన్ (20 బంతుల్లో 26, 4 ఫోర్లు, ఒక సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (0) వెంటవెంటనే ఔట్ అయినా.. అభిషేక్ శర్మ జోరు తగ్గించలేదు. ఎడపెడా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో లక్ష్యం కరిగిపోయింది. తిలక్ వర్మ (16 బంతుల్లో 19, 3 ఫోర్లు) రాణించాడు. అభిషేక్ శర్మ చివర్లో ఔట్ అయినా.. హార్థిక్ పాండ్యా (౩ నాటౌట్)తో కలిసి తిలక్ వర్మ మ్యాచ్‌ను ముగించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరుణ్ చక్రవర్తికి లభించింది.
Also Read: Body Parts Cooked: ఘోరాతి ఘోరం.. భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త
Also Read: Mahakumbh Mela 2025 Yogi: కుంభమేళాలో సీఎం యోగి మంత్రుల పుణ్య స్నానాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter