Jasprit Bumrah Record: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. స్టువర్ట్ బిన్నీ, అనిల్ కుంబ్లే తర్వాత!

Jasprit Bumrah Registers Best bowling figures for India in ODI. జస్ప్రీత్ బుమ్రా వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్‌గా నిలిచాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 13, 2022, 08:48 AM IST
  • జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ గణాంకాలు
  • స్టువర్ట్ బిన్నీ, అనిల్ కుంబ్లే తర్వాత
  • టీ20 ఫార్మాట్‌ జోరు కొనసాగిస్తూ
Jasprit Bumrah Record: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. స్టువర్ట్ బిన్నీ, అనిల్ కుంబ్లే తర్వాత!

Jasprit Bumrah Registers Best bowling figures for India in ODI's: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ అద్భుత విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌ జోరు కొనసాగిస్తూ.. ఇంగ్లండ్‌కు పట్టపగలే చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో మంగళవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్  10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6/19) రికార్డు ప్రదర్శన చేయడంతో ఇంగ్లండ్‌ 25.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. ఆపై రోహిత్‌ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్‌, 7ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించడంతో భారత్ 18.4 ఓవర్లలో 114 పరుగులు చేసింది. 

తొలి వన్డేలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పలు చెరిగాడు. పదునైన బంతుకు వేస్తూ తాను ఎంత ప్రమాదకర బౌలరో మరోమారు నిరూపించాడు.  జేసన్‌ రాయ్‌ (0), జానీ బెయిర్‌స్టో (7), జో రూట్‌ (0), లియామ్ లివింగ్‌స్టోన్‌ (0), బ్రైడన్ కార్సె (15), డేవిడ్ విల్లే (21)లను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలోనే కెరీర్ బెస్ట్ గణాంకాలు (6/19) నమోదు చేశాడు. దాంతో బుమ్రా వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన జాబితాలో టీమిండియా వెటరన్ బౌలర్ స్టువర్ట్ బిన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. 2014లో మిర్పూరులో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో బిన్నీ 4 పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. 1993లో కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే 12 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీశాడు. 2022లో ఓవల్లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో జస్ప్రీత్ బుమ్రా 19 పరుగులకు 6 వికెట్స్ పడగొట్టాడు. 2003లో డర్బన్లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా 23 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీశాడు.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే  

Also Read: బాలుడిని మింగేసిన మొసలి.. ముక్కలు చేసేందుకు ప్రయతించిన కుటుంబీకులు! చివరికి ట్విస్ట్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News