IND vs ENG 03rd Test Match highlights: రాజ్ కోట్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ సేన నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 122 పరుగులకే కుప్పకూలింది ఇంగ్లండ్ జట్టు. దీంతో భారత్ జట్టు 434 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 319 రన్స్‌కే పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. జైస్వాల్ డబుల్ సెంచరీతో 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 లీడ్ లో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో శతకంతోపాటు రెండో ఇన్నింగ్స్ ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగో టెస్టు రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది.
557 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాటర్లు టీమిండియా బౌలర్ల ముందు తేలిపోయారు. బజ్‌బాల్’ క్రికెట్ అంటూ గత కొన్నేళ్లుగా ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తున్న స్టోక్స్ సేన..భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇంగ్లీష్ బ్యాటర్లు మన స్పిన్నర్లు ఉచ్చులో చిక్కుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ డకెట్ సెకండ్ ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ క్రాలేను బుమ్రా బుట్టలో పడ్డాడు. ఓలీ పోప్ (3), జో రూట్ (7), జానీ బెయిర్‌స్టో (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (15), బెన్ ఫోక్స్ (16), టామ్ హార్ట్‌లీ (16) మాత్రమే కాసేపు పోరాడారు. చివరిలో మార్క్ వుడ్ (33) దూకుడుగా ఆడి జట్టు వంద పరుగులలోపు ఆలౌట్ అవ్వకుండా కాపాడాడు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో అదరగొట్టగా.. కుల్‌దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.
Also Read: ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసిన యశస్వి.. వరుసగా రెండో డబుల్ సెంచరీ..
Also Read: IND vs ENG 3rd Test: రాజ్‌కోట్‌లో యశస్వి తుఫాన్ ఇన్నింగ్స్.. టీమిండియాకు భారీ ఆధిక్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook