IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌పై నీలినీడలు.. టీమిండియా సెమీస్ ఆశలకు గండి!

Adelaide Weather reduces India semi final chances in T20 World Cup 2022. అడిలైడ్‌ ఓవల్‌ మైదానం వేదికగా బుధవారం భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 31, 2022, 07:14 PM IST
  • భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌పై నీలినీడలు
  • టీమిండియా సెమీస్ ఆశలకు గండి
  • పట్టిక అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా
IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌పై నీలినీడలు.. టీమిండియా సెమీస్ ఆశలకు గండి!

Rain Threat for India vs Bangladesh Clash at T20 World Cup 2022: ఆసీస్ గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌-12లో భాగంగా భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అడిలైడ్‌ ఓవల్‌ మైదానం వేదికగా బుధవారం (నవంబరు 2) భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం పెర్త్ నుంచి భారత జట్టు సోమవారం అడిలైడ్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. 

నవంబర్ 2న అడిలైడ్‌ వాతావరణంలో మార్పులు ఉంటాయని, ఆకాశం మొత్తం పూర్తిగా మబ్బులు పట్టి ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం అడిలైడ్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందట. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభమైన సమయంలోనే వర్షం పడనుందట. గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. 60-70 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. అడిలైడ్‌లోని వాతావరణం భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. 

వర్షం కారణంగా భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. అప్పుడు గ్రూప్ 2లో ఉన్న భారత్, బంగ్లాదేశ్ ఖాతాలో ఐదు పాయింట్స్ ఉంటాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా భారత్ బంగ్లా కంటే ముందంజలో ఉంటుంది. ఇండో-బంగ్లా మ్యాచ్ రద్దయితే దక్షిణాఫ్రికా పట్టికలో మొదటి స్థానంలో ఉంటుంది. భారత్ రెండు, బంగ్లాదేశ్ మూడో స్థానాల్లో నిలుస్తాయి. ఇప్పటికీ మనమే ముందంజలో ఉన్నా.. జింబాంబ్వేతో మ్యాచ్ కూడా ఇలానే రద్దయితే టీమిండియా సెమీస్ ఆశలకు గండి పడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏ జట్టు సెమీస్ చేరుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

మరోవైపు గ్రూప్ 1 పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచిన న్యూజీలాండ్ 5 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కివీస్ దాదాపుగా సెమీస్ చేరినట్టే. ఇంకో మ్యాచ్ గెలిస్తే అధికారిక బెర్త్ దక్కుతుంది. ఇక రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు రేసులో ఉన్నాయి. నాలుగు మ్యాచులు ఆడిన ఆసీస్.. 5 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్ 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లలో ఒకటి రెండో స్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Mark Adair: ఒకే ఓవర్‌లో 11 బంతులు.. టీ20 ప్రపంచకప్‌లో చెత్త రికార్డు!

Also Read: Aishwarya Rajesh Pics: కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేశ్.. మరింత అందంగా తమిళ బ్యూటీ! పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News