ఈ వీడియోను చూసి ప్రతి భారతీయుడు ఆనందంతో కన్నీరు పెట్టకుండా ఉండలేరేమో!

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళ హిమ దాస్‌ చరిత్ర సృష్టించింది.

Last Updated : Jul 14, 2018, 05:38 PM IST
ఈ వీడియోను చూసి ప్రతి భారతీయుడు ఆనందంతో కన్నీరు పెట్టకుండా ఉండలేరేమో!

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళ హిమ దాస్‌ చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్‌ ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా హిమ సరికొత్త రికార్డు సాధించింది. 18 ఏళ్ల హిమ 51.46 సెకన్లలో 400 మీటర్ల లక్ష్యాన్ని పూర్తి చేసింది. కాగా..బంగారు పతకం  తీసుకున్న అనంతరం భారతదేశం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ సమయంలో.. హిమ దాస్ భావోద్వేగానికి గురైంది. కళ్ల వెంట నీళ్లు వస్తున్నా..  కనీసం కదలకుండా అలాగే భావోద్వేగంతో ఉండిపోయింది. జాతీయ గీతం ఆలపిస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు.

దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ.. ‘మరుపురాని క్షణాలు.. పతకం గెలిచిన తర్వాత హిమ దాస్‌ కళ్లు త్రివర్ణ పతాకాన్ని వెతికాయి. జాతీయ గీతాలాపన సమయంలో భావోద్వేగానికి లోనై ఆమె కన్నీరు పెట్టింది. ఇది నన్నెంతగానో కదిలించింది. ఈ వీడియోను చూసి ప్రతి భారతీయుడు ఆనందంతో కన్నీరు పెట్టకుండా ఉండలేరేమో’ అని అన్నారు.

 

మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా  హిమ భావోద్వేగానికి గురైన  వీడియోను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ట్యాగ్‌‌లైన్‌ పెట్టారు.

 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యాట్సాప్ అంటూ హిమదాస్‌ను నెటిజన్లు కీర్తిస్తున్నారు. జాతి నిన్ను చూసి గర్వించిందమ్మా..! అంటూ అభినందనలు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మ్యాచ్‌లు గెలిచి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలంటూ కోరుతున్నారు.

Trending News