Hardik Pandya Hit Wicket Video: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. గ్రూప్ దశలో నాలుగు విజయాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 71 పరుగుల తేడాతో విజయం సాధించించింది. కేఎల్ రాహుల్ మరో అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా సునాయసంగా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఫ్రీహిట్‌కు హర్థిక్ పాండ్యా హిట్ వికెట్‌గా నిలిచాడు. అయితే బెయిల్స్‌ను సైలెంట్‌గా పెట్టేసిన వీడియో వైరల్ అవుతోంది.
టీమిండియా ఇన్నింగ్స్ 20వ ఓవర్ తొలి బంతిని హర్ధిక్ పాండ్యా ఎదుర్కొన్నాడు. అయితే అది నోబాల్. తరువాత బంతి ఫ్రీహిట్‌ను భారీ షాట్ కొట్టేందుకు యత్నించగా.. తన కాలు వికెట్లను తాకింది. హిట్ వికెట్ ఔట్ అయినా.. ఫ్రీహిట్ కావడంతో బతికిపోయాడు. తరువాత బెయిల్స్ తీసుకుని వికెట్లపై ఉంచి.. బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ ఆ తరువాత బంతికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 18 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. కేవలం 18 పరుగులే చేసి ఔట్ అవ్వడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
— Raj (@Raj54060705) November 6, 2022
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టు 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో 71 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. సెమీ ఫైనల్స్‌లో గ్రూప్ టాపర్‌గా ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించడంతో జింబాబ్వే మ్యాచ్‌కు ముందే భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే ఈ విజయంతో గ్రూప్ లీగ్ ప్రయాణాన్ని అగ్రస్థానంతో ముగించింది.
బంగ్లాదేశ్‌ను ఓడించిన పాక్.. అనూహ్య రీతిలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. నెదర్లాండ్ ఆటగాళ్లను పాక్ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇండియా చేయలేని పని.. పసికూన నెదర్లాండ్స్ చేసిందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాక్ తలపడనుండగా.. ఇంగ్లాండ్‌తో భారత్ ఢీకొననుంది.
Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా విడాకులు..? సోషల్ మీడియాలో వైరల్
Also Read: KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook