Suresh Rains Dance: సురేష్ రైనా అంటే ఫ్లవరనుకుంటివా...కాదు ఫైర్ అంటూ రైనా డ్యాన్స్‌పై నెటిజన్ల కామెంట్లు

Suresh Rains Dance: ప్రస్తుతం ప్రపంచమంతా పుష్ప మేనియా పట్టుకుంది. కొంతమంది తగ్గేదే లే అంటూ మేనరిజం చూపిస్తుంటే..మరి కొంతమంది పాటలకు తమదైన శైలిలో స్టెప్పులేస్తున్నారు. సురేష్ రైనా వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రైనా అంటే ఫ్లవర్ కాదంటున్నారు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2022, 09:55 AM IST
Suresh Rains Dance: సురేష్ రైనా అంటే ఫ్లవరనుకుంటివా...కాదు ఫైర్ అంటూ రైనా డ్యాన్స్‌పై నెటిజన్ల కామెంట్లు

Suresh Rains Dance: ప్రస్తుతం ప్రపంచమంతా పుష్ప మేనియా పట్టుకుంది. కొంతమంది తగ్గేదే లే అంటూ మేనరిజం చూపిస్తుంటే..మరి కొంతమంది పాటలకు తమదైన శైలిలో స్టెప్పులేస్తున్నారు. సురేష్ రైనా వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రైనా అంటే ఫ్లవర్ కాదంటున్నారు..

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లో మెగా హిట్ సాధించింది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేస్తోంది. కోవిడ్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా పెద్దఎత్తున వసూళ్లు వస్తున్నాయి. బన్నీ డైలాగ్ తగ్గేదే లే అన్నట్టుగానే దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రపంచమంతా పుష్ప మేనియా విస్తరిస్తోంది. ముఖ్యంగా క్రికెటర్లకు బాగానే వంటబట్టేసినట్టుంది పుష్ప సినిమా.

కొంతమంది పుష్ప మేనరిజం (Pushpa Mannerism) ప్రదర్శిస్తుంటే..మరి కొంతమంది పుష్పలో పాటలకు స్టెప్పులేస్తున్నారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి  (Srivalli song) పాటకు నిన్న డేవిడ్ వార్నర్ స్టెప్పులేసిన పరిస్థితి. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెటర్ వికెట్ తీసిన ఆనందంలో..గ్రౌండ్‌లో నుంచే..అందరి ముందు తన చేయిను గడ్డం కింద నుంచి అడ్డంగా కదుపుతూ..తగ్గేదే లే అనే మేనరిజం చూపించాడు. ఇప్పటికే చాలామంది క్రికెటర్లు శ్రీవల్లి పాటకు స్టెప్పులేయగా..తాజాగా టీమ్ ఇండియా క్రికెటర్ సురేష్ రైనా ఆ కోవలో చేరారు. తన కుటుంబసభ్యులతో కలిసి బన్నీ స్టెప్పులేశాడు. అంతే కాకుండా..తనదైన శైలిలో అదే డ్యాన్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న స్టైల్‌ను కలిపేశాడు. ఈ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ..అల్లు అర్దున్‌పై ప్రశంసలు కురిపించాడు. పాట చూసి ఆగలేకపోయానని..తన స్టైల్‌లో ట్రై చేశానని ట్యాగ్ చేశాడు. సూపర్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నావ్ బ్రదర్..భారీ విజయం దక్కాలని ఆశిస్తున్నానంటూ కామెంట్ చేశాడు. 

ఈ వీడియో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 6 లక్షల 21 వేల లైక్స్ వచ్చేశాయి. భారీగా కామెంట్లు చేస్తూ నెటిజన్లు (Netizens Comments on Suresh Raina Dance) అటు అల్లు అర్జున్‌ని ఇటు సురేష్ రైనాను కొనియాడుతున్నారు. సురేష్ రైనా (Suresh Raina) మంచి ఫైర్ మీదున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. రైనా అంటే ఫ్లవరనుకుంటివా..ఫైర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పాటతో ఐపీఎల్ ప్రాక్టీస్ చేస్తున్నావా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 

Also read: Sarkaru vaari paata: అభిమానుల్ని ఆకట్టుకుంటున్న సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ట్యూన్, తమన్ చింపేశాడుగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News