IND vs ENG 2nd ODI Pitch Report, Weather Update: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేకు సిద్ధమైంది. లార్డ్స్‌లో నేడు జరిగే మ్యాచులో ఇంగ్లండ్, భారత్ తలపడనున్నాయి. తొలి వన్డే విజయంతో ఊపుమీదున్న భారత్.. అదే జోరులో రెండో వన్డే మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు టీ20 సిరీస్‌తో పాటు తొలి వన్డేలో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్.. టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. రెండు జట్లు బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
పిచ్, వాతావరణం:
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు టాస్ పడనుండగా.. ఐదున్నర గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. సోనీ సిక్స్‌లో రెండో వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. పాక్షికంగా మబ్బులు ఉన్నా.. మ్యాచ్‌కు లాంటి ఆటంకం ఉండదు. అక్కడ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 24 డిగ్రీలు.. కనిష్టంగా 16 డిగ్రిల సెల్సియస్ నమోదు అవుతున్నాయి. ఇక టాస్ గెలిచి జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ముఖాముఖి పోరు:
వన్డే క్రికెట్లో ఇంగ్లండ్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు 104 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 56 విజయాలు, ఇంగ్లండ్ 43 మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. రెండు టైగా ముగిశాయి. ఇక మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఇప్పటివరకూ లార్డ్స్‌లో భారత్ 8 వన్డేలు ఆడి.. నాలుగు గెలిచి, మూడింటిలో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
రెండో వన్డేలో కూడా గెలిస్తే:
2020 తర్వాత ఆసియా మినహా ఇతర దేశాల్లో ఆడిన మూడు వన్డే సిరీస్‌లను భారత్ కోల్పోయింది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లపై ఓడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో మొదటిది గెలిచిన భారత్.. నేడు జరగనున్న రెండో వన్డేలో కూడా గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. దాంతో సుమారు రెండేళ్ల తర్వాత ఆసియేతర దేశాల్లో వన్డే సిరీస్ గెలిచిన భారత జట్టుగా నిలుస్తుంది.
Also Read: Free LPG Cylinder: శుభవార్త.. రేషన్ కార్డుదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు!
Also Read: టీ20 సిరీస్‌కు కోహ్లీ, బుమ్రా దూరం.. కుల్దీప్ వచ్చేస్తున్నాడు! ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook