KL Rahul: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కేఎల్ రాహుల్‌కు గాయం

India vs Bangladesh 2nd Test: టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే బంగ్లాతో రెండో టెస్టుకు ఆడేది అనుమానంగా మారింది. ఒకవేళ రాహుల్ జట్టుకు దూరమైతే.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు..?    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 05:43 PM IST
  • ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు గాయం
  • బంగ్లాతో రేపటి నుంచి రెండో టెస్టు మ్యాచ్‌
  • రాహుల్ ప్లేస్‌లో కెప్టెన్‌గా ఎవరు..?
KL Rahul: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కేఎల్ రాహుల్‌కు గాయం

India vs Bangladesh 2nd Test: టీమిండియాను ఆటగాళ్లు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, నవదీప్ సైనీ బంగ్లాతో రెండో టెస్టుకు కూడా దూరమవ్వగా.. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఆడటం అనుమానంగా మారింది. ప్రస్తుతం రాహుల్ టెస్టు సిరీస్‌లో టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అతని గాయం భారత జట్టుకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌-భారత్ జట్ల మధ్య సిరీస్‌లోని రెండో, చివరి టెస్ట్ మ్యాచ్‌ను గురువారం నుంచి ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

ప్రాక్టీస్‌లో గాయం..

పేసర్ నవదీప్ సైనీ తర్వాత భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో అతడి చేతికి గాయమైంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో అతను ఆడడం అనుమానంగానే ఉందని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు. అయితే మ్యాచ్‌కి ముందు రాహుల్ పూర్తిగా కోలుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.

'రాహుల్ గాయం తీవ్రంగా లేదు. అతను బాగానే కనిపిస్తున్నాడు. అతను బాగుంటాడని ఆశిస్తున్నాను. ప్రస్తుతం వైద్యులు రాహుల్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయితే అతను మ్యాచ్ కంటే ముందే కోలుకుంటాడని భావిస్తున్నారు. వన్డే సిరీస్‌లో మూడో, ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్సీని రాహుల్ స్వీకరించి విజయం సాధించాడు. ఆ తర్వాత టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా అతని నాయకత్వంలో జట్టును 188 పరుగుల తేడాతో గెలిపించాడు.

ఒకవేళ రాహుల్ ఫిట్‌గా లేకపోతే.. రెండో టెస్టుకు దూరమవుతాడు. రాహుల్ స్థానంలో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా మిర్పూర్ టెస్టులో టీమిండియా కెప్టెన్సీని నిర్వహించనున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో పుజారా జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రాహుల్ ఔట్ అయితే.. అభిమన్యు ఈశ్వరన్ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ గాయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Also Read: Delhi Liquor Scam: నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం.. కవితకు రాజగోపాల్ రెడ్డి రిప్లై  

Also Read: 7th Pay Commission: 18 నెలల పెండింగ్ డీఏపై కేంద్రం కీలక ప్రకటన.. రాజ్యసభలో ఏం చెప్పిందంటే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News