/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

BCCI announces annual central contract list for India Women Team: టీమిండియా సీనియర్ మహిళల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది. 17 మంది మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్‌లు దక్కాయి. ఈ 17 మందిని మూడు గ్రేడ్‌లుగా (గ్రేడ్ A, గ్రేడ్ B మరియు గ్రేడ్ C) విభజించింది. '2023-24 సీజన్ కోసం భారత్ సీనియర్ మహిళల వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ ప్రకటించింది' అని భారత క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే మహిళా క్రికెటర్లకు చెల్లించే వేతన వివరాలను బీసీసీఐ వెల్లడించలేదు. కేవలం మూడు గ్రేడ్‌లకు సంబంధించి ప్లేయర్స్ పేర్లను ప్రకటించింది.

భారత మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు గ్రేడ్ A కాంట్రాక్ట్‌లో ఉన్నారు. బీసీసీఐ ఈ ముగ్గురికి మాత్రమే టాప్‌ గ్రేడ్‌ను కేటాయించడం విశేషం. గతేడాది ప్రకారం రూ. 50 లక్షలు వార్షిక వేతనంగా చెల్లించారు. అయితే ఈసారి వేతనం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్‌లకు గ్రేడ్‌ B కాంట్రాక్ట్‌లో చోటు దక్కింది. గ్రేడ్‌ Bలో ఐదుగురు ప్లేయర్లు ఉన్నారు. గతేడాది గ్రేడ్‌ B ప్లేయర్లు రూ. 30 లక్షలు చెల్లించారు. 

గ్రేడ్‌ C కాంట్రాక్ట్‌లో 9 మందికి బీసీసీఐ చోటిచ్చింది. సబ్బినేని మేఘన, అంజలి సర్వాని, మేఘ్నా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ్‌ రాణా, రాధా యాదవ్, హర్లీన్‌ డియోల్‌, యస్తికా భాటియా గ్రేడ్‌ C కాంట్రాక్ట్‌ జాబితాలో ఉన్నారు. ఈ గ్రేడ్‌లో ఉన్నవారికి గతేడాది వార్షిక వేతనం రూ. 10 లక్షలుగా ఉంది. పురుషుల, మహిళల మ్యాచ్‌ ఫీజులను సమానంగా చెల్లిస్తామని బీసీసీఐ పెద్దలు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే వేతనాలు మాత్రం చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. పురుష టాప్‌ గ్రేడ్‌ A+ కేటగిరీలో ఉన్నవారికి రూ. 7 కోట్ల వేతనం అందుతుంది. గత మార్చిలో పురుషుల జట్టు వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది.

గ్రేడ్ ప్రకారం మహిళా ప్లేయర్స్ జాబితా:
గ్రేడ్ A: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ. 
గ్రేడ్ B: ​​రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గయక్వాడ్. 
గ్రేడ్ సి: మేఘనా సింగ్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, అంజలి సర్వాణి, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా. 

గ్రేడ్ ప్రకారం పురుషుల ఆటగాళ్ల జాబితా:
గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా. 
గ్రేడ్ A: హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్. 
గ్రేడ్ B: ​​ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్
గ్రేడ్ C: ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్. 

Also Read: Rinku Singh-Virat Kohli: కింగ్ కోహ్లీ కాళ్లు మొక్కిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్‌!

Also Read: DC Player Woman: పూటుగా మద్యం సేవించి.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Section: 
English Title: 
BCCI Womens Contract 2023: BCCI announces annual central contract list for India Women Team, Harmanpreet Kaur and Smriti Mandhana in Grade A
News Source: 
Home Title: 

BCCI Contract: మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ.. జెమీమా, షఫాలీకి నిరాశే!
 

BCCI Womens Contract 2023: మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ.. ముగ్గురికి మాత్రమే టాప్‌ గ్రేడ్‌!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ.. జెమీమా, షఫాలీకి నిరాశే!
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Thursday, April 27, 2023 - 17:00
Request Count: 
35
Is Breaking News: 
No
Word Count: 
379