IPL Broadcasting Rights Price: రాబోయే ఐదేళ్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయం (BCCI Income From IPL) మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా దాదాపుగా రూ.37 వేల కోట్లకు పైగా ఆదాయం రానుంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోకి మరో రెండు కొత్త టీమ్స్ చేరనున్న క్రమంలో బీసీసీఐకి రెట్టింపు సంపద వచ్చి పడనుంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ (IPL Broadcast Value) కోసం గతంలో జరిగిన బిడ్‌లో ఐదేళ్లకు (2018 - 2022) స్టార్ ఇండియా సొంతం చేసుకుంది.
2018లో జరిగిన బ్రాడ్‌కాస్టింగ్ బిడ్‌లో రూ.16,347.5 కోట్లకు స్టార్ ఇండియా (Star Sports IPL Broadcasting Rights Price) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం 2022 వరకు ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు స్టార్ ఇండియా (Star India IPL) చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో రెండు కొత్త టీమ్స్ చేరనున్న నేపథ్యంలో మ్యాచ్‌ల సంఖ్య 74కు చేరనుంది. ఈ విధంగా బ్రాడ్‌కాస్టింగ్ విలువ డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా రాబోయే ఐదేళ్లలో రూ.37 వేల కోట్లు బీసీసీఐకి ఖాతాకు చేరనున్నాయి.
ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ను సాధారణంగా టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్, రేడియా, సోషల్ మీడియా వంటి విభాగాల్లో (BCCI broadcasting rights) విక్రయించి బీసీసీఐ సొమ్ము చేసుకుంటుంది. రాబోయే ఐదేళ్ల (2023 - 2027) బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ వేలం కోసం అక్టోబరు 25న బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించనుంది. అదే రోజున ఐపీఎల్ కొత్త టీమ్స్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీని బిడ్డింగ్ విలువ రూ.7,000 నుంచి రూ.10,000 కోట్ల వరకు పలుకనుంది. దీని కారణంగా బ్రాడ్‌కాస్టింగ్ విలువ (IPL Broadcasting Rights Price) కూడా పెరుగుతుందని ఓ అధికారి వెల్లడించారు. ఈ వేలానికి స్టార్ ఇండియాతో పాటు సోనీ సంస్థ కూడా పోటీ పడనుందని ఆయన తెలిపారు.
కొత్త టీమ్స్ కోసం పోటీగా..
ఐపీఎల్లో (IPL Broadcast Value) రెండు కొత్త టీమ్స్‌ను (New IPL Teams) సొంతం చేసుకునేందుకు అనేక కార్పొరేట్ కంపెనీలు వేలంలో పోటీ పడనున్నాయి. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఓ టీమ్‌ను కొనుగోలు చేసిన రెడ్ బర్డ్ క్యాపిటల్స్ అనే అమెరికా ఆధారిత సంస్థ కూడా బరిలో నిలవనుందని సమాచారం. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం ఈ సంస్థకు 15 శాతం వాటా ఉంది. దీంతో పాటు టీమ్ఇండియాకు చెందిన ఓ సీనియర్ క్రికెటర్, అదానీ గ్రూప్, కొటాక్, అరబిందో ఫార్మా, టొరెంట్ గ్రూప్, ఆర్పీ సంజీవ్ గొయంకా గ్రూప్ కూడా ఐపీఎల్లో కొత్త టీమ్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read: Squid Game Challenge: 'స్క్విడ్ గేమ్' ఛాలెంజ్ విన్నర్స్ గా రోహిత్, షమీ
Also Read: T20 World Cup 2021: IND Vs PAK మ్యాచ్‌ల్లో అతి పెద్ద కాంట్రావర్శీలు, ఎప్పటికీ గుర్తుండే హైలైట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IPL Broadcasting Rights Price: రూ.37 వేల కోట్లకు ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్!