Australia vs New Zealand World Cup 2023: వరల్డ్ కప్‌లో మరో నరాలుతెగే ఉత్కంఠభరిత పోరు జరిగింది. శనివారం ధర్మశాలలో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో జయకేతనం ఎగురువేసింది. ఆఖర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. ఆసీస్ ప్లేయర్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేయడంతో కివీస్ గెలుపు అంచులవరకు వచ్చ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (109), డేవిడ్ వార్నర్ (81) రాణించారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగులకు పరిమితమైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. రచిన్ రవీంద్ర (116) సెంచరీతో చెలరేగగా.. మిచెల్ (54), జేమ్స్ నీషమ్ (58) అర్ధ సెంచరీలు బాదారు.
ఆస్ట్రేలియా విధించిన 389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టింది. ఓపెనర్లు విల్ యంగ్, డేవిడ్ కాన్వే తొలి వికెట్‌కు 7.2 ఓవర్లలోనే 61 పరుగుల జోడించారు. అయితే హేజిల్‌వుడ్ వరుస ఓవర్లలో వీరిద్దరిని ఔట్ చేసి దెబ్బతీశాడు. మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రచిన్ రవీంద్ర 89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 116 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ కూడా 51 బంతుల్లో 54 పరుగులు చేయడంతో కివీస్ కోలుకుంది. చివర్లో జేమ్స్ నీషమ్ 39 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు.
చివరి ఓవర్‌లో కివీస్ విజయానికి 19 పరుగులు అవసరం అవ్వగా.. ఫస్ట్ బాల్‌కు బౌల్ట్ సింగిల్ తీశాడు. రెండో బాల్‌ను స్టార్క్ వైడ్ వేయగా.. కీపర్ అందులేకపోయాడు. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. 5 బంతుల్లో 13 పరుగులుగా సమీకరణం మారిపోయింది. తరువాతి మూడు బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. 2 బంతుల్లో 7 పరుగులు అవసరం అవ్వగా.. జేమ్స్ నీషమ్ షాట్ ఆడాడు. రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. చివరి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా.. ఫెర్గుసన్ పరులేమి చేయలేదు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, హేజిల్‌వుడ్, కమిన్స్ చెరో రెండు వికెట్లు, స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ తొలి వికెట్‌కు 19.1 ఓవర్లలోనే 175 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. మిచెల్ మార్ష్ (36), మ్యాక్స్‌వెల్ (41), జోష్ ఇంగ్లిస్ (38), పాట్ కమిన్స్ (37) రాణించారు. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, బౌల్ట్ చెరో 3 వికెట్లు, సాంట్నర్ 2, నీషమ్, మాట్ హెన్రీలు చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆసీస్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది.
Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వం బంపర్ బహుమతి.. 7వ వేతన సంఘం అమలుపై కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook