ఆసియా క్రీడలు 2018: హెప్తథ్లాన్‌లో భారత క్రీడాకారిణి స్వప్న బర్మన్‌కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో పసిడి పతకం వచ్చి చేరింది. మహిళల హెప్తథ్లాన్ విభాగంలో స్వప్న బర్మన్‌ పసిడి పతకాన్ని పొందడం విశేషం. 

Last Updated : Aug 29, 2018, 10:42 PM IST
ఆసియా క్రీడలు 2018: హెప్తథ్లాన్‌లో భారత క్రీడాకారిణి స్వప్న బర్మన్‌కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో పసిడి పతకం వచ్చి చేరింది. మహిళల హెప్తథ్లాన్ విభాగంలో స్వప్న బర్మన్‌ పసిడి పతకాన్ని పొందడం విశేషం. తన ఫస్ట్ రౌండ్‌ను 6026 పాయింట్లతో ముగించడంతో హెప్తథ్లాన్ ఈవెంట్‌లో స్వప్న బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.  ఏడు రకాల ఈవెంట్లను హెప్తథ్లాన్‌లో భాగంగా నిర్వహిస్తారు. ఈ పతకంతో భారత్ ఖాతాలో 11 బంగారు పతకాలు చేరాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో 11 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.

హెప్తథ్లాన్‌లో ఎంతో కష్టపడితే గానీ స్వప్నను విజయం వరించలేదు. నిన్న హైజంప్ పోటీలో కూడా ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. అలాగే ఆమెకు పన్నెండు వేళ్లు ఉండడడం వల్ల... తాను ఈ పోటీలో పాల్గొనడానికి ప్రత్యేకమైన బూట్లు కూడా తయారుచేయించుకొని ప్రాక్టీసు చేయాల్సి వచ్చింది. రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు అందిస్తోన్న అథ్లెట్ మెంటర్ షిప్ ప్రోగ్రామ్‌తో పాటు గో స్పోర్ట్స్ ఫౌండేషన్ ఇచ్చిన ఆర్థిక సహాయంతోటే ఆమె ఇప్పటి వరకూ పోటీల్లో పాల్గొంటూ వస్తున్నారు.

29 అక్టోబరు 1996లో జన్మించిన స్వప్న బర్మన్ 2014లో తొలిసారిగా ఆసియా క్రీడల్లో హెప్తథ్లాన్ పోటీల్లో పాల్గొన్నారు. కానీ అప్పుడు ఆమె అయిదవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2017లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం కైవసం చేసుకున్న స్వప్న.. పటియాలా ఫెడరేషన్ కప్‌లో కూడా పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. 

Trending News