Asia Cup: 1984లో ఆసియా కప్ మొదలైంది. అత్యధికంగా ఏడు సార్లు ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ జట్టు రెండు సార్లు సొంతం చేసుకుంది. ఈఏడాది ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. ఆసియా కప్‌లో ఐదుగురు ఆటగాళ్లు అత్యధిక పరుగులు చేశారు. ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉన్నారు.
సనత్ జయసూర్య..
ఆసియా కప్‌లో శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య అత్యధిక స్కోర్ చేశాడు. అతడు ఈటోర్నీలో 25 మ్యాచ్‌లు ఆడి 53 సగటుతో 12 వందల 20 పరుగులు సాధించాడు.
కుమార సంగక్కర..
శ్రీలంకకు చెందిన మరో ఆటగాడు కుమార సంగక్కర అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 23 మ్యాచ్‌ల్లో 1075 పరుగులు చేశాడు.
సచిన్ టెండూల్కర్..
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసి మూడో ఆటగాడిగా నిలిచాడు. 23 మ్యాచ్‌లు ఆడి 971 పరుగులు సాధించాడు. బ్యాటింగ్‌తోకాకుండా బౌలింగ్‌లో 17 వికెట్లు తీశాడు.
షోయబ్ మాలిక్..
అత్యధిక పరుగుల వీరుల్లో పాకిస్థాన్ తరపున షోయబ్ మాలిక్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆసియాకప్‌లో 21 మ్యాచ్‌లు ఆడి 907 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.
రోహిత్ శర్మ..
ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల వీరుల్లో ఐదోస్థానంలో ఉన్నాడు. అతడి సారధ్యంలోనే 2018లో భారత్ ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఆసియా కప్‌లో 27 మ్యాచ్‌లు ఆడి 883 పరుగులు సాధించాడు.
Also read:Bihar: బీహార్ సీఎంగా మరోమారు నితీష్‌కుమార్ ప్రమాణం..కొత్త కేబినెట్ కూర్పు ఇదే..!
Also read:Rythu Bima: తెలంగాణ రైతులకు శుభవార్త..రైతు బీమా నమోదు గడువు పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook