లీసెస్టర్: టీ20 చరిత్రలో ఇంతకు మునుపెన్నడూ లేని ప్రపంచ రికార్డుకు ఇంగ్లండ్‌లో జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్ వేదికైంది. లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్-బర్మింగ్‌హామ్ బేర్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్, పార్ట్‌టైం బౌలర్ కోలిన్ అకెర్‌మన్ నాలుగు ఓవర్లలో ఏడు వికెట్లు పడగొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కోలిన్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. లీసెస్టర్‌షైర్ కెప్టెన్ కూడా అయిన కోలిన్ ఏడు వికెట్లు పడగొట్టడమే కాకుండా కేవలం 18 పరుగులే ఇవ్వడం మరో విశేషం. మైఖెల్ బర్గెస్, శామ్ హెయిన్, విల్ రోడ్స్, లియం బాంక్స్, అలెక్స్ థాంసన్, హెన్రీ బ్రూక్స్, జీతన్ పటేల్ వికెట్స్ పడగొట్టి కొలిన్ బర్మింగ్‌హమ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.
0️⃣3️⃣4️⃣W0️⃣1️⃣0️⃣1️⃣1️⃣1️⃣1️⃣1️⃣W2️⃣W0️⃣W0️⃣W1️⃣1️⃣W1️⃣W
Colin Ackermann takes 7/18 - the best bowling figures in T20 history
➡️ https://t.co/afo2WOG7iX pic.twitter.com/BLgpf0H2F1
— Vitality Blast (@VitalityBlast) August 7, 2019
కోలిన్ అకెర్‌మన్ సాధించిన ఈ ఘనతతో ఇప్పటివరకు మలేషియా స్పిన్నర్ అరుల్ సుప్పియ్య పేరుపై ఉన్న టీ20 మ్యాచ్‌లో అత్యధిక వికెట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 2011లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో సుప్పియ్య ఐదు పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అలా ఇప్పటి వరకు సుప్పియ్య పేరుపై పదిలంగా ఉన్న ఆ రికార్డును తాజాగా కోలిన్ అకెర్‌మన్ అధిగమించాడు. ఒక టీ20 మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఇప్పటి వరకు 30 మందికిపైగా బౌలర్లు ఉన్నప్పటికీ.. ఏడు వికెట్లు పడగొట్టడం మాత్రం ఇదే తొలిసారి కావడం కోలిన్ అకెర్‌మన్‌కి ప్రపంచ రికార్డును సొంతమయ్యేలా చేసింది.
టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు