Venus Retrograde 2023: శుక్రుడి తిరోగమనం ఎఫెక్ట్, ఈ మూడు రాశులకు సెప్టెంబర్ 4 వరకూ ఊహించని డబ్బులు

Venus Retrograde 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతి గ్రహం కొన్ని అంశాలకు, పరిణామాలకు ప్రతీక అవుతుంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో మారుతుండటం లేదా వక్రమార్గం పట్టడం అనేది ప్రాధాన్యత కూడుకున్న పరిణామాలు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 26, 2023, 06:50 AM IST
Venus Retrograde 2023: శుక్రుడి తిరోగమనం ఎఫెక్ట్, ఈ మూడు రాశులకు సెప్టెంబర్ 4 వరకూ ఊహించని డబ్బులు

Venus Retrograde 2023: ఖగోళ శాస్త్రంలో గ్రహాల కదలిక ఓ సహజ ప్రక్రియ అయినా జ్యోతిష్యం ప్రకారం ప్రాధాన్యత, మహత్యం కలిగి ఉంటాయి. అదే విధంగా శుక్రుడి వక్రమార్గం ప్రభావంతో రానున్న కొద్దిరోజుల్లో 3 రాశుల జీవితాలు సమూలంగా మారిపోనున్నాయి. ఊహించని డబ్బు వచ్చి పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కనకవర్షం కురవనుంది.

హిందూమతం ప్రకారం శుక్ర గ్రహాన్ని ధన సంపదలు, ఐశ్వర్యం, విలాసం, ప్రేమ, రోమాన్స్ ఇలా వివిధ అంశాలకు ప్రతీక. అందుకే శుక్రుడి గ్రహ కదలికలో మార్పులు కొన్ని రాశులకు ఈ అంశాలపై ప్రభావం చూపిస్తుంటుంది. ప్రస్తుతం శుక్ర గ్రహం సింహ రాశిలో వక్రమార్గంలో ఉన్నాడు. దాంతో ఈ 3 రాశులకు రానున్న రోజుల్లో ఆకాశం నుంచి పెద్దఎత్తున డబ్బులు వచ్చి పడతాయి. కుండలిలో శుక్ర లాభం ఉంటే ఆ వ్యక్తులకు ఎప్పుడూ డబ్బులకు లోటుండదంటారు. ఈ రాశులవారికి ప్రతి సుఖం లభిస్తుంది. ఈ సమయంలో శుక్ర గ్రహం సింహ రాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. దాంతో ఆర్ధిక, ప్రేమ, వైవాహిక,ఉద్యోగ , వ్యాపార రంగాల్లో ప్రభావం కన్పిస్తుంది. 3 రాశులవారికి సెప్టంబర్ 4 వరకూ అమితమైన లాభాలు ఆర్జించిపెట్టనుంది.

శుక్రుడి వక్రమార్గం ప్రభావం మిధున రాశి జాతకులకు మంచి రోజుల్ని తెచ్చిపెట్టనుంది. ఈ రాశి జాతకులకు అదృష్టం తోడుగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకోవడం, వ్యాపారం విస్తృతం కావడంతో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులుండవు. అదే సమయంలో ఉద్యోగులకు కూడా చాలా అనువైన సమయం, పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తవడమే కాకుండా ఎప్పట్నించో ఆగిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్ధిక వ్యవహారాలు చక్కబడతాయి.

ధనస్సు రాశి జాతకులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. శుక్రుడి వక్రమార్గం ప్రభావం ఈ రాశి జాతకులపై ఊహించని రితిలో ఉంటుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థానంలో ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. పనిచేసేచోట ఊహించని లాభాలుంటాయి. మీ సంతానం విషయంలో కూడా లాభపడతారు. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఊహించని రీతిలో ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు.

వృషభ రాశి జాతకులకు శుక్రుడి వక్రమార్గం కారణంగా చాలా అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. ఈ రాశి వారి జీవితంతలో చాలా వృద్ధి ఉంటుంది. ఇళ్లు, భూమి, వాహనం కొనుగోలు చేయనున్నారు. ఐశ్వర్యం, ధన సంపదలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందం సమృద్ధిగా ఉంటుంది. ఆర్ధికంగా పటిష్ట స్థితిలో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. 

Also read: Saturn Transit 2023: శని గ్రహం స్థితిలో మార్పు ప్రభావంతో రాత్రికి రాత్రి కుబేరులవడం ఖాయం, ఎప్పట్నించంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News