Vastu Tips: చదువులో ఈ వాస్తు టిప్స్​ పాటిస్తే విజయం మీ వెంటే!

Vastu Tips: ఇంట్లో చదువుకునే వాళ్లు ఉన్నారా? వాళ్లు అనుకున్నది సాధించాలంటే వాస్తు పరమైన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సూచనలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 12:44 PM IST
  • చదువుకునే వారికి వాస్తు టిప్స్​!
  • ఇంట్లో స్డడీ రూం ఎక్కడివైపు ఉండాలి?
  • స్డడీ రూమ్​లో ఉండకూడని వస్తువులు ఏవి?
Vastu Tips: చదువులో ఈ వాస్తు టిప్స్​ పాటిస్తే విజయం మీ వెంటే!

Vastu Tips: జీవితంలో ఎంతో సాధించాలని చాలా మది కలలు కంటుంటారు. అందుకోసం కోసం ఎంతో కష్టపడి చదువుతుంటారు కూడా. అయితే కష్టపడి పడి చదువుతున్నప్పటికీ.. కొన్నిసార్లు అనుకున్నది జరగటం లేదని చెబుతుంటారు. ఇందుకు కారణం వాస్తు కూడా కావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే చదువు విషయంలో పాటించాల్సిన వాస్తుపరమైన జాగ్రత్తలను సూచిస్తున్నారు.

స్డడీ రూమ్ వాస్తు ఎలా ఉండాలి?

చదువుకునే విద్యార్థులకు స్టడీ రూ్ తూర్పు, ఉత్తరం దిశలో ఉండటం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ రూమ్ ఎల్లప్పుడు శుభ్రంగా, ప్రశాంతంగా కూడా ఉండాలి.

ముఖ్యంగా ఆ రూమ్​లో ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులు ఏవీ ఉండకూడదు. అప్పుడే చదివిని ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకోగలుగుతారని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

ఇక స్టడీ రూమ్​ గోడల రంగుల విషయంలో కూడా జాగ్రత్త అవసరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు తెలుగుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. గులాబీ, క్రీమ్ రంగులు కూడా మేలు చేస్తాయని సూచిస్తున్నారు. ఈ రంగులు ఏకాగ్రతను పెంచుతాయని వివరిస్తున్నారు.

చదువుకునే టేబుల్​ను గదిలో దక్షిణం లేదా పడమటి వైపు ఉండటం మంచిదని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

ఈ వస్తువులు ఉండకుండా చూసుకోండి..

చదువుకునే రూమ్​లో ఎట్టి పరిస్థితుల్లోనూ.. పదునైన వస్తువులు పెట్టుకోవద్దని చెబుతున్నారు నిపుణులు.

సూదులు, కత్తెర్లు, అద్దాలు, ఎలక్ట్రానిక్స్​, సినిమా పోస్టర్లు వంటివి స్డడీ రూమ్​లో ఉండకూడదని చెబుతున్నారు.

జంతువుల విగ్రహాలు, వ్యర్థ పదార్థాలు కూడా స్డడీ రూమ్​లో ఉంచడం ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయంటున్నారు విశ్లేషకులు.

Also read: Maha Shivratri 2022: మహాశివరాత్రి నాడు శివుడిని పూజించడంలో ఈ తప్పులు చేయకండి!

Aslo read: Horoscope March 1 2022: ఈ రోజు మహాశివరాత్రి.. కొన్ని రాశులకు అనుకూలం.. ఆ రాశులకు ప్రతికూలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News