Tulsi Plant: హిందూమతంలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తీవ్ర అశుభమట. ఎండల వేడి నుంచి తులసి మొక్కలు ఎండిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
తులసి మొక్కనేది లక్ష్మీదేవి ఆవాసమట. నియమిత పద్ధతిలో క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతారు. అయితే చాలాసార్లు తులసి మొక్క ఎండిపోతుంటుంది. ఇంట్లోని తులసిమొక్క ఎండిపోవడం అశుభంగా భావిస్తారు. అందుకే జ్యోతిష్యశాస్త్రంలో దీనికి కొన్ని మార్గాలున్నాయి. ఈ మార్గాలు పాటిస్తే తులసిమొక్కడిపోకుండా పచ్చదనంతో ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం..
తీక్షణమైన ఎండ వేడిమి కారణంగా తులసి మొక్క ఎండిపోతుంటుంది. ఫలితంగా లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది. వేసవిలో తులసి మొక్కలు ఎండిపోకుండా పైన ఎర్రరంగు చున్నీ కప్పాలి. తద్వారా తులసిమొక్కపై నేరుగా ఎండ ప్రసరించదు. లేదా తులసి మొక్కల స్థానం మార్చాలి. నీడ ఎక్కువగా ఉండే స్థానంలో ఉంచితే చాలామంచిది.
తులసి మొక్క ఎండలో ఎండిపోకుండా ఉండేందుకు అందులో ఎప్పుడూ తేమ ఉండేట్టు చూసుకోవాలి. అందుకే తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు కొద్గిగా పచ్చిపాలు కూడా వేయండి. ఇలా చేస్తే మొక్కలో తేమ ఎక్కువసేపుంటుంది. ఇది కాకుండా తులసి మొక్క నాటేటప్పుడు అన్నింటికంటే దిగువన కొబ్బరి పీచు వేయాలి. ఆ పైన మట్టి వేయాలి. దీనివల్ల తులసి మొక్కలో నీరెండిపోదు.
విష్ణు భగవంతుడికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకో తులసి మొక్కకు తెగులు ఏదైనా వస్తే వెంటనే సరి చేయింాలి. దీనిని శ్రీ హరి పాదాల వద్దకు సమర్పిచాలి. దీనివల్ల తులసి మొక్క వేగంగా పెరుగుతుంది. వారం పది రోజుల్లో తులసి మొక్కలో గోబర్ ఎరువు వేయడం వల్ల మొక్క పచ్చదనంతో తాజాగా ఉంటుంది. ఎండిన పేడను తులసి మట్టిలో కలిపి వేర్లలో వేయాలి.
Also read: Sankashti Chaturthi 2022: సంకష్టి చతుర్థి వ్రతం ఎప్పుడు? గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Tulsi Plant: తులసి మొక్క ఎండితే అరిష్టమేనా..మరి ఎండిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి