Supermoon 2023: ఇవాళ రాత్రి సూపర్ మూన్, రక్షాబంధన్ ముహూర్తం సమయం, తేదీ ఎప్పుడంటే

Supermoon 2023: రాఖీ పండుగ వచ్చేసింది. ప్రతి యేటా శ్రావణ పౌర్ణిమ నాడు జరుపుకునే రక్షాబంధన్ ఇది. ఈసారి రాఖీ నాడు చంద్రుడు కాస్త ప్రత్యేకంగా కన్పించనున్నాడు. ఈసారి ఆకాశంలో సూపర్ మూన్ ఆవిష్కారం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 30, 2023, 06:52 AM IST
Supermoon 2023: ఇవాళ రాత్రి సూపర్ మూన్, రక్షాబంధన్ ముహూర్తం సమయం, తేదీ ఎప్పుడంటే

Supermoon 2023: సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు, అనురాగానికి చిహ్నం రాఖీ వేడుక. ఈసారి రక్షాబంధన్ కు ఆకాశంలో అరుదైన ఘటన కన్పించనుంది. ఇవాళ చంద్రుడితో పాటు మరో పెద్ద గ్రహం కన్పించనుంది. ప్రతి ఏటా కన్పించే చంద్రుడితో పోలిస్తే ఈసారి చంద్రుడు మరింత ప్రత్యేకం. ఈసారి చంద్రుడి పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది.

ప్రతి రాఖీ పండుగ రోజు పౌర్ణిమ కావడంతో చంద్రుడి పూర్తిగా కన్పిస్తాడు. కానీ ఈసారి భూమి చుట్టూ పరిభ్రమించే చంద్రుడు భూమికి అతి దగ్గరి పాయింట్ చేరుకోవడంతో ఈసారి పెద్ద పరిమాణంలో అంటే సూపర్ మూన్‌గా సాక్షాత్కరించనుంది. అందుకే ఈసారి రక్షాబంధన్ చాలా ప్రత్యేకం కానుంది. ఖగోళ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్టు 30వ తేదీ అంటే ఇవాళ రాత్రి సూపర్ మూన్ కన్పించనుంది. మైక్రో మూన్‌తో పోలిస్తే దాదాపు 14 రెట్లు పెద్దదిగా 30 రెట్లు ప్రకాశవంతమైందిగా కన్పించనుంది.చంద్రుడి భూమికి దగ్గరగా అంటే దాదాపు 3 లక్షల 57 వేల 181 కిలోమీటర్ల దూరంలో కన్పించనుంది.

అయితే ఇది సూపర్ మూన్ అని బ్లూ మూన్ కాదని పరిశోధకులు చెబుతున్నారు. చంద్రుడు ఈసారి తెల్లగా మెరుస్తూ కన్పిస్తాడంటున్నారు. ఈ అరుదైన ఘటన చూసేందుకు టెలీస్కోప్ అవసరం ఉండదంటున్నారు. ఇంటి పైకప్పు నుంచి చాలా సులభంగా చూడవచ్చు. ఇవాళ చంద్రుడితో పాటు శని గ్రహం కూడా ఆకాశంలో చూడవచ్చు. సూర్యుడు అస్తమించగానే తూర్పు దిశలో చంద్రుడిని ఉదయిస్తూ చూడవచ్చు. కాస్సేపటికిక చంద్రుడి దిగువన శని గ్రహం కన్పిస్తుంది. చంద్రుడు-శని గ్రహాల యుతి అనేది అరుదైన ఘటన.

రక్షాబంధన్ ముహూర్తం ఎప్పుడు

ఇవాళ రక్షాబంధన్ శుభ ముహూర్తం రాత్రి 9 గంటల 1 నిమిషం నుంచి ప్రారంభమై..1 గంటల 13 నిమిషాల వరకూ ఉంటుంది. అటు అమృత కాల ముహూర్తం ఆగస్టు 31 ఉదయం 5 గంటల 42 నిమిషాల నుంచి ప్రారంభమై ఉదయం 7 గంటల 23 నిమిషాల వరకూ ఉంటుంది. ఆ తరువాత పౌర్ణిమ ముగుస్తుంది. పౌర్ణిమ ముగిసిన తరువాత రక్షాబంధన్ కట్టుకోవచ్చు. అంటే రక్షాబంధన్ రేపు ఆగస్టు 31నే జరుపుకోవల్సి ఉంటుంది.

Also read: Raksha Bandhan 2023: రాఖీ పండగ రోజున మీ సోదరులకు ఈ రంగు రాఖీలు కడితే అన్ని శుభాలే..లాభాలే లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News