Surya Grahan 2023: రేపే సూర్య గ్రహణం.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా, సూతకాల సమయం ఉంటుందా?

Solar Eclipse 2023, No Surya Grahan 2023 sutak kaal in India. సూర్య గ్రహణం యొక్క వ్యవధి 5 ​​గంటల 24 నిమిషాలు. అయితే సూర్య గ్రహణ సూతకాలం గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 19, 2023, 09:49 PM IST
Surya Grahan 2023: రేపే సూర్య గ్రహణం.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా, సూతకాల సమయం ఉంటుందా?

There is no Surya Grahan 2023 sutak kaal in India: 2023లో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ముందుగా సూర్య గ్రహణం ఏర్పడనుంది. మరోకొన్ని గంటల్లో (ఏప్రిల్ 20న) ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఏర్పడనుంది. సూర్య గ్రహణం పేరు వినగానే అందరి మనసులో భయాందోళనలు కలుగుతాయి. ఎందుకంటే రాహు-కేతువు అన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గ్రహణాల సమయంలో దేవుళ్ళు శక్తి కూడా తగ్గుతుందని జ్యోతిష్యశాస్రంలో చెప్పబడింది. సూర్య గ్రహణ సూతకాలం చాలా అశుభంగా పరిగణించబడుతుంది. 

ఈ ఏడాది మొదటి గ్రహణం అమావాస్య (ఏప్రిల్ 20వ తేదీన వైశాఖ మాసంలోని కృష్ణ పక్షంలో) ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో అస్సలు కనిపించదు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఈ గ్రహణం కనిపిస్తుందో.. ఖచ్చితంగా ఆ ప్రదేశంలోని ప్రజలపై ప్రభావం చూపుతుంది. గ్రహణం కనిపించని ప్రాంతంలోని ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 20న ఉదయం 7.4 గంటలకు గ్రహణం ప్రారంభమై.. మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది. 

సూర్య గ్రహణం యొక్క వ్యవధి 5 ​​గంటల 24 నిమిషాలు. అయితే సూర్య గ్రహణ సూతకాలం (Solar Eclipse 2023 Sutakaal) గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. అయితే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూత కాలం చెల్లదు. కాబట్టి భారత ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో అన్ని పనులు యధావిధిగా చేసుకోవచ్చు. 

భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కానీ చైనా, అమెరికా, మైక్రోనేషియా, మలేషియా, ఫిజీ, జపాన్, సమోవా, సోలమన్, సింగపూర్, థాయిలాండ్, కంబోడియా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం, తైవాన్, పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ , దక్షిణ హిందూ మహాసముద్రం మరియు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది.

Also Read: Shraddha Das Hot Pics: వైట్ శారీలో శ్రద్ధా దాస్.. అదిరే ఒంపుసొంపులతో హాట్ ట్రీట్ ఇచ్చేసింది!  

Also Read: Rakul Preet Singh Hot Pics: రెడ్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. లోదుస్తులు లేకుండా హాట్ స్టిల్స్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News