Saturn Retrograde effect: 2024లో తిరోగమనంలో శని... ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Shani Vakri 2024 effect: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. 2024లో శని గ్రహం రివర్స్ కదలిక మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 12:20 PM IST
Saturn Retrograde effect: 2024లో తిరోగమనంలో శని... ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Saturn Retrograde 2024 effect: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2024లో తమ ప్యూచర్ ఎలా ఉండబోతోందని అందరిలోనూ ఆందోళన ఉంటుంది. అయితే శనిదేవుడు వచ్చే ఏడాదిలో కొందరి అదృష్టాన్ని మార్చబోతున్నాడు. శని గ్రహం జూన్ 30 నుంచి నవంబరు 15 వరకు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉండనున్నాడు. ఈ సమయంలో మూడు రాశులవారు జాక్ పాట్ కొట్టనున్నారు. శని అనుగ్రహం పొందే ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేష రాశి
న్యూ ఇయర్ లో శనిదేవుడు మేషరాశి వారిపై కాసుల వర్షం కురిపించనున్నాడు. మీ ఆదాయం పెరుగుతుంది.  మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. జాబ్ చేసేవారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మకర రాశి
2024లో మకర రాశి వారిపై శనిదేవుడు ఆశీస్సులు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి  మెరుగుపడుతుంది. మీకు పూర్వీకులు ఆస్తి కలిసి వస్తుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ప్రేమలో పడతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కష్టాల నుండి విముక్తి పొందుతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
సింహం
సింహరాశి వారిపై శనిదేవుడి ప్రత్యేక ఆనుగ్రహం ఉంటుంది. ఇది సింహరాశి వారి జాతంలో శష్ యోగాన్ని ఏర్పరస్తుంది. దీని కారణంగా వీరి కెరీర్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. అంతేకాకుండా భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. సింహరాశి వ్యక్తులకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 

Also Read: Mars transit 2024: మంగళ గ్రహం గోచారం, రుచక రాజయోగంతో ఈ మూడు రాశులకు వద్దంటే డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News