Shani Trayodashi August 2024: జాతకంలో శని గ్రహం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే వ్యక్తులు పేదవారైనా ఉన్నట్లుండి ధనవంతులవుతారు. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలు వస్తాయి. శని గ్రహం సంచారం కారణంగా ఆగస్టు నెలల చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆగస్టు 18న శని సంచారం చేయబోతోంది. ఈ గ్రహం రాత్రి 10:03 గంటలకు శనిగ్రహం పూర్వ భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయనుంది. అయితే ఆగస్టు 17నే శనిత్రయోదశి కూడా రాబోతోంది. కాబట్టి ఈ నక్షత్ర సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ నక్షత్రంలో శని గ్రహం మొదటి దశలో దాదాపు అక్టోబర్ 2వ తేది వరకు ఉండబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఆగస్టు 18న జరిగే గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారిపై ఏలినాటి శని ప్రభావం మరింత పెరుగుతుంది. కుంభ రాశిలో శని సంచార దశలో ఉండడం వల్ల కుంభ, మకర, మీన రాశుల వారిపై శని సాడే సతి ప్రభావం మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మూడు రాశులవారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 17 శనిత్రయోదశి రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల అశుభ ప్రభావం కూడా తగ్గుతుంది. అలాగే అనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
శనిత్రయోదశి రోజున శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే మార్గాలు:
1. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆగస్టు 17న శనిత్రయోదశి రోజున తప్పకుండా శని ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
2. ఈ రోజు తప్పకుండా శని దేవుడి విగ్రహం ముందు ఆవనూనె దీపం వెలిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉసిరి చెట్టు ముందు దీపం వెలించి శని శోస్త్రాన్ని కూడా పఠించాల్సి ఉంటుంది.
3. అలాగే శనిత్రయోదశి రోజున పేదవారికి నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల కూడా శని అనుగ్రహం లభిస్తుంది.
4. శనిగ్రహానికి సంబంధించిన చెడు ప్రభావం నుంచి విముక్తి పొందడానికి ఈ రోజు తప్పకుండా హనుమంతుడికి ప్రత్యేకమైన పూజలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.