Shani Margi 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన గమనాన్ని మారుస్తూ ఉంటుంది. దీని ప్రభావం మెుత్తం అన్ని రాశుల ప్రజలపై ఉంటుంది. ఇది కొందరికి శుభంగానూ, మరికొందరికి అశుభంగానూ ఉంటుంది. శనిదేవుడు అక్టోబరు 23న అంటే ధంతేరాస్ (Dhanteras 2022) రోజున తిరోగమనం నుంచి మార్గంలోకి (Shani Margi 2022) రానున్నాడు. దీంతో నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృశ్చికం (Scorpio): శని మార్గి వల్ల ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారానికి సంబంధించిన ఫ్లాన్స్ విజయవంతమవుతాయి. ఫ్యామిలీ సోపోర్టు ఉంటుంది.
సింహం (Leo): ఈ రాశి వారికి శని మార్గం చాలా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతు్ంది. ఖర్చులను నియంత్రించుకుంటే మీకే మంచిది.
మీనం (pisces): ఈ రాశి వారికి శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయి. శని మార్గి వల్ల పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభిస్తుంది. కుటుంబంతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
మేషం (Aries): ధంతేరాస్ నాడు శని గ్రహం యొక్క కదలికలో మార్పు కారణంగా ఈ రాశి వారికి అదృష్టం తెరవబడుతుంది. వారి వ్యాపారం పెరుగుతుంది. కొత్త కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుంది.
తుల (Libra): శని మార్గి కారణంగా తులరాశివారిక ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ టైంలో బంగారం కొనడం మీకు శుభప్రదంగా ఉంటుంది.
Also read: Dhanteras 2022: ధనత్రయోదశి రోజు ధన్వంతరిని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Shani Margi 2022: ధంతేరాస్ నాడు మార్గంలోకి శనిదేవుడు...ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు..