Saturn Transit 2023 Effect: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, కొన్ని ముఖ్యమైన గ్రహాలు ఈ నెల ప్రారంభంలో సంచరించనున్నాయి. కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. జనవరి 17న శనిదేవుడు కుంభంలోకి వెళ్లనున్నాడు. అనంతరం మార్చి 15న శనిదేవుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. త్వరలో జరగబోయే శని యెుక్క సంఘటనల్లో శని సంచారం, శని అస్తమించడం, సూర్యుడితో శని కలయిక మరియు శని నక్షత్రం మారడం ముఖ్యమైనవి. శని నక్షత్రం మార్పు వల్ల ఏ రాశుల వారికి శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
రాశిచక్రాలపై శని నక్షత్రం మార్పు ప్రభావం
మిథునరాశి (Gemini): మిథునరాశి వారికి శని నక్షత్రం మార్పు శుభఫలితాలను ఇస్తుంది. ఈ సమయం వీరికి వరమనే చెప్పాలి. వ్యాపారుల భారీగా లాభాలను గడిస్తారు. అదృష్టం కలిసి వచ్చి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి.
సింహ రాశి (Leo): శని సంచారం సింహ రాశి వారికి వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు దాని నుండి గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. పార్టనర్ షిప్ తో చేసే బిజినెస్ లో లాభపడతారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. డబ్బు రాక పెరుగుతుంది.
మకరం (Capricorn): శనిగ్రహం శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మకర రాశి వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. బాధలు తగ్గుతాయి. మీరు ఆకస్మిక ధనలాభాలను మరియు మంచి అవకాశాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడతారు. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం బాగానే ఉంటుంది.
Also Read: Shattila Ekadashi 2023: శటిల ఏకాదశి ఎప్పుడు? ఈరోజున నువ్వులను ఎందుకు దానం చేస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.