Shani Dev Margi 2022: మార్గంలోకి శనిదేవుడు... దీపావళికి ఈ 4 రాశులవారి జీవితాల్లో వెలుగులు..

Shani Dev Rashi Change: అక్టోబరు 23న అంటే ధన్‌తేరస్ రోజున న్యాయ దేవుడైన శని గ్రహం ప్రత్యక్ష సంచారంలోకి రానుంది. దీంతో 4 రాశులవారిపై డబ్బు వర్షం కురవనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2022, 06:46 AM IST
Shani Dev Margi 2022: మార్గంలోకి శనిదేవుడు... దీపావళికి ఈ 4 రాశులవారి జీవితాల్లో వెలుగులు..

Shani Dev Margi 2022: న్యాయదేవతగా పిలువబడే శనిదేవుడు ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇతడు అక్టోబరు 23న అంటే ధంతేరాస్ రోజున మకరరాశిలో మార్గంలోకి (Shani Dev Margi in Capricorn 2022) వస్తాడు. శనిదేవుడు ప్రత్యక్ష సంచారం వల్ల 4 రాశులవారి అదృష్టం తెరుచుకోనుంది. శని మార్గం కారణంగా ఈ నాలుగు రాశులవారికి శని అశుభప్రభావాల నుండి విముక్తి లభిస్తుంది. కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తిచేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భారీగా డబ్బు సంపాదిస్తారు. అంటే మెుత్తం మీద ఈసారి దీపావళికి ఈ 4 రాశుల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్న మాట. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి శనిదేవుని కటాక్షం
కర్కాటకం (Cancer): ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఐక్యత మరియు శాంతి నెలకొంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు బాగా సాగుతాయి. వ్యాపారులు కొత్త కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం  ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. 
మిథునం (Gemini): శని దేవుడి మార్గం వల్ల ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్టం  కలిసి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది.  

వృశ్చికం (Scorpio): వీరి వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి రిజల్ట్స్  సాధిస్తారు. మీరు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతును పొందుతారు, తద్వారా మీరు వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తారు. పాత వ్యాధి నయం అవుతుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 
మేషం (Aries): న్యాయాధిపతి అయిన శని దేవుడి మార్గం ఈ రాశి వారికి మేలు చేస్తుంది. పాత కోర్టు కేసుల నుంచి విముక్తి పొందవచ్చు. కుటుంబంతో కలిసి బయట ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది.

Also Read: Mangal Gochar 2022: శత్రు రాశిలో కుజుడు సంచారం... వీరి జీవితం కష్టాలమయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News