Shani Asta 2023: కుంభరాశిలో శనిదేవుడి అస్తమయం... వీరి ఇంటి నిండా నోట్ల కట్టలే...!

Shani Asta 2023: శనిదేవుడి స్థానంలో పెను మార్పు రానుంది. జనవరి 30న శనిదేవుడు కుంభరాశిలో అస్తమించనున్నాడు. ఇది కొందరికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2023, 12:21 PM IST
Shani Asta 2023: కుంభరాశిలో శనిదేవుడి అస్తమయం... వీరి ఇంటి నిండా నోట్ల కట్టలే...!

Shani Asta 2023: చాలా మంది శనిదేవుడిని క్రూరగ్రహంగా భావిస్తారు. అయితే శనిదేవుడు కూడా శుభఫలితాలను ఇస్తాడు. ఇతడి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారికి దేనికీ లోటు ఉండదు. జనవరి 17న శనిగ్రహం మకర రాశిని వదలి కుంభరాశిలోకి ప్రవేశించనుంది. అనంతరం జనవరి 30న శనిదేవుడు అస్తమించనున్నాడు. 28 రోజులపాటు శనిగ్రహం ఇదే స్థితిలో ఉంటాడు. శని సంచారం వల్ల మూడు రాశులవారి జీవితాల్లో పెనుమార్పులు రానున్నాయి. అవేంటో తెలుసుకుందాం. 

శనిదేవుడి అస్తమయం ఈ రాశులకు అదృష్టం
వృషభం (Taurus): శనిదేవుడు అస్తమయం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. వివాహం కుదిరే అవకాశం ఉంది. 
తుల రాశి (Libra): ఈ రాశి వారికి శని సెట్ ఫలప్రదంగా ఉంటుంది. తులారాశి వారికి శనిగ్రహం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. సంతానం లేనివారికి పిల్లలు పడతారు. ఆర్థికంగా బలపడతారు. ఆదాయంలోరెట్టింపు పెరుగుదల ఉంటుంది. విద్యార్థులు పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. 
మకరం (Capricorn): మకర రాశి వారికి శని అస్తమించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగంలో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగులు లాభపడతారు. కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. బిజినెస్ లో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. గ్లామర్ మరియు కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.

Also read: Mercury Planet: మరో 3 రోజుల్లో ఈ 3 రాశులకు అదృష్టం.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News