Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఈ 4 రాశులపై ప్రతికూల ప్రభావం.. మీరున్నారా?

Solar Eclipse 2023: ఈ సంవత్సరం రెండో సూర్యగ్రహణం అక్టోబరులో ఏర్పడబోతుంది. ఈ ఖగోళ దృగ్విషయం కొన్ని రాశులవారి పై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఈ సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2023, 06:14 PM IST
Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఈ 4 రాశులపై ప్రతికూల ప్రభావం.. మీరున్నారా?

Last Surya Grahan 2023 Date: ఆస్ట్రాలజీలో సూర్య, చంద్ర గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అక్టోబరు 14న సంభవించబోతుంది. ఇది అశ్వినీ అమావాస్య నాడు కన్యారాశి మరియు చిత్ర నక్షత్రాలలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. సూర్యగ్రహణం కారణంగా ఏ రాశులవారికి సమస్యలు పెరుగుతాయో  తెలుసుకుందాం. 

సూర్యగ్రహణం ఈ రాశులకు అశుభం
సింహరాశి - ఈ ఏడాది ఏర్పడబోయే రెండో సూర్యగ్రహణం వల్ల సింహరాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు చెడు వార్తలు వింటారు. మీ గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో అస్సలు పెట్టుబడి పెట్టొద్దు. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
మేషరాశి - ఈ సంవత్సరం ఏర్పడబోయే చివరి సూర్యగ్రహణం మేషరాశి వారికి అస్సలు మంచిది కాదు. ఈ గ్రహణం మీకు అనేక సమస్యలను కలిగిస్తుంది. మీ డబ్బు దుబారా అయ్యే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. మీరు వ్యాపార, ఉద్యోగాల్లో నష్టాలను చవిచూస్తారు.  

Also read: Festival in June 2023: జూన్ నెలలో వచ్చే పండుగలు, వ్రతాల లిస్ట్ ఇదే..!

తుల రాశి- సూర్యగ్రహణం తులరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు డబ్బు వృథా చేస్తారు. మీరు ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. 
కన్యారాశి- సూర్యగ్రహణం వల్ల కన్యారాశి వారు తమ కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మీకు ఈ సమయం అస్సలు కలిసిరాదు. 

Also read: Lucky Zodiac Signs in June: జూన్‌లో ఈ 5 రాశుల వారు చాలా అదృష్టవంతులు.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News