December 19 Horoscope: ఈ రాశివారు ఆదివారం స్నేహితులకు దూరంగా ఉండండి.. దొరికితే అంతే!

RasiPhalalu/Horoscope Today, December 19 2021: ప్లవ నామ సంవత్సరం.. ఆదివారం, డిసెంబర్ 19, 2021 రాశిఫలాలు.. ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి కలిసి వస్తూ ఉంటుంది. మరి ఈ ఆదివారం కొన్ని రాశులకు చాలా అనుకూలంగా ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 01:22 PM IST
  • ఆదివారం, డిసెంబర్ 19, 2021 రాశిఫలాలు
  • ఈ ఆదివారం కొన్ని రాశులకు చాలా అనుకూలం
  • ఆ రాశి వారు మాత్రం స్నేహితులకు దూరంగా ఉంటే మేలు
December 19 Horoscope: ఈ రాశివారు ఆదివారం స్నేహితులకు దూరంగా ఉండండి.. దొరికితే అంతే!

RasiPhalalu horoscope december 19 2021 this sunday those zodiac signs chances to getting money : ఆదివారం, డిసెంబర్ 19, 2021 రాశిఫలాలు.. 
విక్రం సంవత్సరం - ఆనంద 2078, మార్గశిరము 15
ఇండియన్ సివిల్ క్యాలెండర్ - 1943, మార్గశిరము 28
పుర్నిమంతా - 2078, మార్గశిరము 30
అమాంత - 2078, మార్గశిరము 15
తిథి
శుక్లపక్షం పూర్ణిమ  - Dec 18 07:24 AM – Dec 19 10:05 AM
బహుళపక్షం పాడ్యమి  - Dec 19 10:05 AM – Dec 20 12:36 PM

నక్షత్రం
మృగశిర - Dec 18 01:48 PM – Dec 19 04:52 PM
ఆరుద్ర - Dec 19 04:52 PM – Dec 20 07:46 PM

సూర్య, చంద్ర సమయం
సూర్యోదయము - 6:44 AM
సూర్యాస్తమానము - 5:41 PM
చంద్రోదయం - Dec 19 5:53 PM
చంద్రాస్తమయం - Dec 20 7:32 AM

అననుకూలమైన సమయం
రాహు - 4:19 PM – 5:42 PM
యమగండం - 12:13 PM – 1:35 PM
గుళికా - 2:57 PM – 4:19 PM
దుర్ముహూర్తం - 04:14 PM – 04:58 PM
వర్జ్యం - 02:17 AM – 04:05 AM

శుభ సమయం
అభిజిత్ ముహుర్తాలు - 11:51 AM – 12:35 PM
అమృతకాలము - 06:57 AM – 08:45 AM
బ్రహ్మ ముహూర్తం - 05:08 AM – 05:56 AM

ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి కలిసి వస్తూ ఉంటుంది. మరి ఈ ఆదివారం కొన్ని రాశులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకెళ్తే కొన్ని రాశుల వారు మంచి ఫలితాలు చూస్తారు. మరికొందరు రోజంతా ఎంతో ఆనందంగా గడుపుతారు. ఒక రాశివారు మాత్రం ఈ ఆదివారం స్నేహితులకు దూరంగా ఉంటే మంచిది. మరి ఈ ఆదివారానా మీ రాశి ఫలం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. 

మేషం: (Aries)
మేషరాశి వారు ఈ రోజు అన్నీ శుభవార్తలు వింటారు. ఒక గౌరవప్రదమైన వ్యక్తి మీకు సలహాలు ఇస్తారు. ఆ వ్యక్తి నుంచి మీ జీవితానికి సంబంధించిన మార్గదర్శకత్వం అందిస్తారు. దాన్ని శ్రద్దగా వినండి. ఆ ప్రకారం మీరు జీవితంలో ముందుకెళ్తే.. అంతా లాభదాయకంగానే ఉంటుంది. చిన్న చిన్న ప్రలోభాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనుల్లో పురోగతి లభిస్తుంది. ఆ పనులు ఈ రోజు నుంచి క్రమంగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది.

వృషభం: (Taurus)

వృషభ రాశి వారు ఈ ఆదివారం పూట మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రేమను పొందుతారు. మీరు ఏదైనా ప్రాజెక్ట్ కు సంబధించి పరిశోధన చేసే అవకాశం పొందొచ్చు. ఇక మీరు వ్యాపారస్తులు అయితే ఈరోజు నిజాయితీగా పని చేయండి. అలాగే కోర్టులకు సంబంధించిన కేసుల నుంచి బయటపడతారు. మీరు మీ బాధ్యతలన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఎలాంటి ఆటంకాలుండవు.

మిథునం: (Gemini)
మిథున రాశి వారు ఈ ఆదివారం పూట మీ కోసం సమయం కేటాయించుకోండి. మీ ఇంట్లో వారిపై నమ్మకం ఉంచండి.. దీంతో మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం. ఆదాయం కూడా బాగుంటుంది. డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి.

Also Read : Garuda Puranam: ఈ నాలుగు కనిపిస్తే.. ఆరోజు మీకు తప్పక శుభం కలుగుతుంది...

కర్కాటకం: (Cancer)
ఈ రోజు మీ అభిప్రాయాలను ఎదుటి వారికి చెప్పేందుకు అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ ప్రతిష్టను ఇంకా పెంచుతారు. జీవితంలో మరింత పురోగతి సాధించడానికి ఇవాళ కొన్ని కొత్త మార్గాలు అన్వేషిస్తే చాలా మేలు. వ్యాపారులకు ఈ రోజు మరింత లాభదాయకంగా ఉంటుంది. అధిక ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి.

సింహం: (Leo)
సింహం రాశి వారు ఈ రోజు ఇతరులు చెప్పేది వినండి. మీకు మీ పై అధికారుల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సింహరాశి వారు ఇతరులకు ఇచ్చిన డబ్బును ఈ రోజు తిరిగి పొందుతారు. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. ఈ రోజు మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో మీకు స్నేహితుల నుంచి సహకారం అందుతుంది.

కన్య: (Virgo)
కన్యరాశి వారు ఇవాళ చాలా మందితో మాట్లాడాల్సి వస్తుంది. దీంతో మీ మనస్సు ఉత్తేజమవుతోంది. రోజంతా మీకు నచ్చి వ్యక్తులతో సంతోషంగా గడుపుతారు. ఇక మంచి పరిజ్ఞానం ఉన్న, సీనియర్ వ్యక్తులతో పని చేసే అవకాశం మీకు లభిస్తుంది.. ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకండి. ఇక వ్యాపారులు అయితే చాలా ఆలోచించి ముందడుగు వేయాలి. ఆర్థిక వ్యవహారాలన్నీ పరిష్కారమవుతాయి.

తుల: (Libra)

రాజకీయాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఉత్సాహం మీలో పెరుగుతుంది. ఫుడ్ బిజినెస్ చేసే వారికి బాగా కలిసొస్తొంది. విద్యార్థులకు మంచి నిపుణులైన ఉపాధ్యాయుల సహాయం అందుతుంది. 

వృశ్చికం: (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఇవాళ అంతా మంచే జరుగుతుంది. మీరు ఆన్‌లైన్‌లో కొత్త ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. అయితే త్వరగా డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో తప్పుడు పథకాల్లో పెట్టుబడులను పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. 

ధనుస్సు : (Sagittarius)

ధనస్సు రాశి ఈ రోజు అంతా మంచే జరుగుతుంది. ఇక ఈ రోజు మీకు కొన్ని విషయాల్లో ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. డబ్బు సమకూరుతుంది. మీ ప్రవర్తన కుటుంబంలోని అందరికీ నచ్చుతుంది. అందరి మద్దతూ మీకే లభిస్తోంది. 

మకరం : (Capricorn)
కొత్త ఆశలతో ఈ రోజు ప్రారంభమవుతుంది. రియల్ ఎస్టేట్‌ వ్యాపారులు.. మీకు డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మీ వ్యాపారంలో ఏవైనా మార్పులు చేసే ముందు, తప్పనిసరిగా సీనియర్లను సంప్రదిస్తే మంచిది. మీ ఇంటికి కొత్త అతిథులు వచ్చే అవకాశం ఉంది.

కుంభం: (Aquarius)
మీ దినచర్యలో కొన్ని మార్పులు చేర్పులు అవసరం. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కుంభ రాశి వారు ఈ రోజు స్నేహితులకు దూరంగా ఉంటే మేలు.. దొరికితే అంతే సంగతులు మరి.

మీనం : (Pisces)

మీరు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. ఒక నిర్దిష్ట విషయంలో మీ ఆలోచన మారవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఒకవేళ వ్యాపారం చేస్తుంటే.. దాన్ని మరింత అభివృద్ధి పరచుకోవడానికి కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలి. గతంలో ఆపేసిన అన్ని పనులను, ప్లాన్‌లను మళ్లీ ప్రారంభించడానికి ఇదే మీకు సరైన సమయం. 

Also Read : Shani Dev blessings: ఆ మూడు రాశుల వారిపై శని దేవుడి ఆశీస్సులు.. అందుకే చాలా సులభంగా ధనవంతులవుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News