Mercury Transit 2023: కన్యా రాశి జాతకులకు గుడ్‌న్యూస్. బుధుడి రాశి పరివర్తనం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఊహించనంత డబ్బు వచ్చి పడనుంది. ఇదేదో కలగా ఉందనుకుంటున్నారేమో..నిజమే కన్యా రాశికి ఇది ప్రత్యేకం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే గ్రహాలు రాశి మారిన ప్రతిసారీ ఇతర రాశులపై పడే సానుకూలం, వ్యతిరేక ప్రభావాన్ని లెక్కిస్తుంటారు. ప్రతి నెలా ప్రతి గ్రహం రాశి మారుతుంటుంది. వాస్తవానికి గ్రహాల రాశి పరివర్తనం వివిధ రాశులపై ఒక్కోలా ఉంటుంది. సానుకూలంగానూ , ప్రతికూలంగానూ ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం బుద్ధికి, వాణిజ్యానికి ప్రతీకగా భావించే బుధుడు సెప్టెంబర్ ప్రారంభంలో కన్యారాశిలో ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో సింహం, మిధునం, తులా రాశులపై ప్రత్యేక ప్రభావం పడనుంది. ఈ రాశులవారికి ఏడాది తరువాత అటు వృత్తిపరంగా ఇటు వ్యాపారపరంగా అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. భారీగా ధనలాభముంటుంది.
బుధుడు కన్యారాశిలో ప్రవేశించడం మిధున రాశి జాతకులకు అత్యంత లాభదాయకం కానుంది. ముఖ్యంగా వంశపారంపర్యంగా వ్యాపారం చేసేవారికి అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకుల సంపద చేతికి అందుతుంది. ఏదైనా కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. బుధుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల మిధున రాశి జాతకుల వ్యక్తిత్వంలో, వైఖరిలో మార్పు కన్పిస్తుంది. ఎదుగుదల స్పష్టంగా ఉంటుంది. ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బందులు ఉండవు.
సింహ రాశి జాతకులకు బుధుడి గోచారం అత్యంత శుభప్రదం కానుంది. బుధుడు ఆదాయానికి సంబంధించిన రాశికి అధిపతి అయినందున అన్ని లాభాలే కలగనున్నాయి. అందుకే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ఆర్ధికంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటంతో ఏ విధమైన సమస్యలుండవు. గతంలో పెండింగులో పడిన డబ్బులు చేతికి అందుతాయి.
తులా రాశి జాతకులకు సైతం ఈ సమయం చాలా అనుకూలమైందిగా పరిగణిస్తారు. షేర్ మార్కెట్, లాటరీ, జూదం వంటి రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జిస్తారు. ఈ రాశి జాతకులకు ఆర్ధిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. ఈ రాశివారు ఉద్యోగులైనా, వ్యాపారులైనా ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు లాభిస్తాయి. ఊహించని మార్గం నుంచి ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులుండవు.
Also read: Venus In Transit: ఈ రాశులవారి జీవితాలు ఆగస్టు 1 తేది నుంచి మరింత దిగజారబోతున్నాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook