Mars transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కారక రాశిలో మంగళ గ్రహం గోచారం జరగనుంది. దీని ప్రభావం ముఖ్యంగా 4 రాశుల జాతకాలపై విశేషంగా ఉండనుంది. అంతులేని ధన సంపదలతో ఆ రాశులపై నోట్లవర్షం కురవనుంది. పూర్తి వివరాలు మీ కోసం..
హిందూ జ్యోతిష్యంలో మంగళ గ్రహాన్ని అత్యంత శుభదాయంగా భావిస్తారు. అంటే శుభం కల్గించే దేవతగా చెబుతారు. జీవితంలో సాహసాన్ని, పరాక్రమాన్ని కల్గించేది ఈ గ్రహమే. ఫలితంగా జీవిత శక్తి పెరుగుతుంది. కుండలిలో మంగళ గ్రహం అనుకూలంగా ఉండటం చాలా అవసరమంటారు అందుకే. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. మంగళ గ్రహం ఎప్పుడు రాశి పరివర్తనం చెందినా..పలు రాశులకు ప్రయోజనం కలగుంది. మే 10వ తేదీన మంగళ గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. జూలై 1 వరకూ సుదీర్ఘ కాలమే ఈ రాశిలో ఉంటుంది. ఆ తరువాత సింహ రాశిలో ప్రవేశిస్తుంది. ఫలితంగా 82 రోజుల వరకూ ఆ 4 రాశులపై విశేష కటాక్షం కురిపించనుంది. ఈ నాలుగు రాశులకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆ 4 అదృష్టరాశులేంటో తెలుసుకుందాం..
ధనస్సు రాశి
ఈ రాశివారికి మంగళ గ్రహం గోచారం చాలా సంతోషాల్ని తీసుకొస్తుంది. ఒక్కసారిగా ఊహించని ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగులో పూర్వీకుల సంపద లభించవచ్చు. అప్పిచ్చిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. కుటుంబంలో స్నేహభావం పెరుగుతుంది. బంధాలు పటిష్టంగా ఉంటాయి. పిల్లల విషయంలో నిశ్చింతగా ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉంటే మంచిది.
వృషభ రాశి
మంగళ గ్రహం గోచారం చాలా అంశాలపై విశేష ప్రభావం చూపిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రత్యర్ధులు మీపై ప్రభావం చూపించవచ్చు. మిమ్మల్ని ఓడించేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేయవచ్చు. చిన్న చిన్న యాత్రలు చేస్తారు. అకారణంగా వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
మీన రాశి
మంగళ గ్రహం గోచారం ప్రభావం మీనరాశిపై అద్భుతంగా ఉండబోతోంది. ఆర్ధికంగా లాభదాయకం కానుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. చదువు కోసం విదేశాలకు వెళ్లవచ్చు. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది. విద్యార్ధుల చదువు విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవల్సి ఉంటుంది.
కన్యా రాశి
మంగళ గ్రహం గోచారం కారణంగా కన్యారాశిపై విశేష ప్రభావం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. మీరు చేపట్టే ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో చాలా లాభాలు ఆర్జిస్తారు. వ్యాపారం విస్తృతమౌతుంది. ఖర్చులు తగ్గుతాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశమొస్తుంది. జీవిత భాగస్వామితో మంచి బంధం కొనసాగుతుంది.
Also read: April Festival Calendar 2023: ఏప్రిల్ నెలలో రానున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Mars transit 2023: మంగళ గ్రహం ప్రభావం, జూలై 1 వరకూ ఆ 4 రాశులకు అంతా డబ్బే