Angarak Yogam: మీరు అంగారక యోగంతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి

Angarak Yoga: ఆస్ట్రాలజీలో అంగారక యోగాన్ని అశుభకరంగా భావిస్తారు. జాతకంలో ఈ యోగం ఉన్న వ్యక్తులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 01:26 PM IST
Angarak Yogam: మీరు అంగారక యోగంతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి

Angarak Yoga Remedies: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఈ గ్రహాల సంయోగం వల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఇందులో కొన్ని శుభకరంగా ఉంటే...మరికొన్ని అశుభకరంగా ఉంటాయి. జాతకంలో అశుభయోగం ఉన్న వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.  
కుజుడు, రాహువు కలయిక వల్ల అశుభకరమైన అంగారక యోగం (Angarak Yogam) ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మనిషి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. జాతకంలో ఈ యోగం ఉన్న వ్యక్తి స్వభావం కోపంగా, దూకుడుగా మరియు హింసాత్మకంగా ఉంటుంది. దీని కారణంగా బంధువులతో సంబంధాలు క్షీణిస్తాయి. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి ఆస్ట్రాలజీలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. ఆ నివారణలేంటో తెలుసుకుందాం. 

అంగారక యోగ పరిహారాలు..
>> హనుమాన్ చాలీసా పఠించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఈ అశుభ యోగం యెుక్క దుష్ర్రభావాలు తగ్గుతాయి. మీరు మీ లైఫ్ లోని సమస్యల నుండి బయటపడతారు. 
 >> అంగారక యోగం యొక్క అశుభ ప్రభావాలను తగ్గించడానికి రాహు మరియు మంగళ మంత్రాలను పఠించండి. 
>> కుజ యోగ ప్రభావం వల్ల బంధువులతో సంబంధాలు క్షీణిస్తాయి. ఏనుగు దంతాన్ని ఇంట్లో ఉంచడం వల్ల మీకు శుభఫలితాలు తగ్గుతాయి. ఇంటి పెద్దలకు, తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
 >> అంగారక యోగం ప్రభావం నివారణకు మంగళవారం నాడు బెల్లం నూనెలో కుంకుమ కలిపి హనుమంతుడికి రాయండి. 

Also Read: Budh Gochar 2022: బుధుడి సంచారం.. నవంబరు 13 వరకు ఈ రాశుల వారికి కష్టకాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News