Surya Grahan 2023: సూర్యగ్రహణం నాడు రాశి మార్పు యోగం.. ఏప్రిల్ 20 నుండి ఈ 5 రాశులవారు జాగ్రత్త..

Surya Grahan 2023: ఏప్రిల్ 20న ఈ ఏడాది మెుదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంతేకాకుండాఇదే రోజు బుధుడు-అంగారకుడు రాశి మార్పు యోగం చేయనున్నారు. దీని వల్ల 5 రాశులవారు నష్టపోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 12:52 PM IST
Surya Grahan 2023:  సూర్యగ్రహణం నాడు రాశి మార్పు యోగం.. ఏప్రిల్ 20 నుండి ఈ 5 రాశులవారు జాగ్రత్త..

Rashi Parivartan Yog effect: మరో  రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ ఖగోళ సంఘటన మేషం మరియు అశ్వనీ నక్షత్రాల్లో ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం రోజున బుధ గ్రహం అంగారక రాశి అయిన మేషరాశిలో ఉంటుంది. మరోవైపు కుజుడు బుధుడి రాశి అయిన మిథునరాశిలో సంచరించనుంది. దీని వల్ల రాశి మార్పు యోగం ఏర్పడుతుంది. ఇది 5 రాశులవారికి అశుభంగా ఉంటుంది. 

కన్య: సూర్యగ్రహణం కారణంగా కన్యా రాశి వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి చిన్న చిన్న విషయాలకు వాదించకండి. వీలైనంత సమస్యను పరిష్కరించడానికే చూడండి. 
తుల: రాశి మార్పు యోగం తులరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించనుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 
మకరం: సూర్యగ్రహమం కారణంగా మకర రాశి వారి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీ కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. ఈ సమయంలో హెల్త్ పై కేర్ తీసుకోండి. 

Also Read: Guru Gochar 2023: ఏప్రిల్ 22న ఊహించని ఘటన.. ఈ 3 రాశులకు అంతులేనంత ఐశ్వర్యం..

మేషరాశి: కుజుడు-బుధ రాశి మార్పు యోగం మేషరాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు. ఈ సమయంలో అస్సలు పెట్టుబడి పెట్టవద్దు. మీ ఖర్చులను తగ్గించుకోండి. 
వృషభం : వృషభరాశి వారికి ఈ రాశి మారే యోగం అస్సలు మంచిది కాదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. పెట్టుబడులు జోలికి పోకండి. 

Also Read: First Solar Eclipse 2023: ఏర్పడబోయేది కంకణ కృతి సూర్యగ్రహణం, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే, లేకపోతే అంతే సంగతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News