Lucky Zodiac Sign: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే... ఇందులో మీరున్నారా?

Lucky Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అంతేకాకుండా వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2023, 10:36 AM IST
Lucky Zodiac Sign: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే... ఇందులో మీరున్నారా?

Maa Lakshmi Ke Upay:  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశిచక్రం ఏదో ఒక దేవతకు సంబంధించినది. ఈ దేవత ప్రభావం ఆరాశి వారి జీవితంపై ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. వీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆ దేవతకు ఫేవరేట్ రాశులేంటో తెలుసుకుందాం. 

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులివే..
కర్కాటక రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఆనందం, మనస్సు మరియు తల్లికి కారకుడిగా చంద్రుడిని భావిస్తారు. చంద్రుని రాశి వ్యక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహం చెప్పలేనంత ఉంటుంది. ఆ తల్లి దయతో భారీ మెుత్తంలో డబ్బును, వ్యాపారం వృద్ధిని పొందుతారు. 
వృషభం
ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇతడిని సంపద, లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. ఈరాశి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేకం అనుగ్రహం ఉంటుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాదిస్తారు. వ్యాపారంలో భారీగా లాభాలు గడిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. 
తులారాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశికి అధిపతి శుక్ర గ్రహం. ఇతడు ఆకర్షణ, సంపద మరియు ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. లక్ష్మీదేవి కటాక్షంతో మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. 
సింహరాశి 
ఈ రాశికి అధిపతి సూర్యుడు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. లక్ష్మీదేవి దయతో మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశిచక్రాన్ని పాలించే గ్రహం మార్స్. ఇతడిని ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. ఈ రాశివారికి లక్ష్మి తల్లి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. 

Also Read: Shani Nakshatra Gochar 2023: శతభిషా నక్షత్రంలో శని సంచారం.. ఈ 6 రాశుల వారిపై డబ్బు వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News