Lucky Zodiac Sign: కుబేరుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉండే రాశులు ఇవే.. మీది ఉందా?

Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారిపై కుబేరుడు అనుగ్రహం ఉంటుంది. వీరికి దేనికీ లోటు ఉండదు. ఈ రాశులవారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి. కుబేరుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉండే ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2023, 05:03 PM IST
Lucky Zodiac Sign: కుబేరుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉండే రాశులు ఇవే.. మీది ఉందా?

Lucky Zodiac Sign:  ఆస్ట్రాలజీ ప్రకారం, కొందరు పుట్టుకుతోనే అదృష్టవంతులుగా ఉంటారు. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరికొందరు ఎంత కష్టపడినప్పుటికీ వారి వద్ద డబ్బు నిలవదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మెుత్తం 12 రాశులు ఉన్నాయి. ఇందులో కొన్ని రాశులవారిపై కుబేరుడు ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలను కురిపిస్తూ ఉంటారు. దీని కారణంగా ఈ రాశులవారికి దేనికీ లోటు ఉండదు. సంపదకు దేవుడిగా కుబేరుడిని భావిస్తారు. కుబేరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే రాశులు ఏవో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
కుబేరుడి దయ కర్కాటక రాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు తెలివితేటలకు కొదవ ఉండదు. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు కెరీర్ లో మంచి స్థానానికి చేరుకుంటారు. మీరు డబ్బును ఆదా చేస్తారు. 
వృషభం
కుబేరుడి కటాక్షం ఉండే రాశులకు వృషభం కూడా ఒకటి. కుబేరుడి అనుగ్రహంతో వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈరాశి వారికి డబ్బుకు కొరత ఉండదు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. దీని కారణంగా వీరి ప్రేమ మరియు వైవాహిక జీవితం బాగుంటుంది. 
తులారాశి
కుబేరుడు అనుగ్రహం తులరాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు రిచ్ లైఫ్ అనుభవిస్తారు. కుబేరుడు వల్ల మీరు ధనవంతులు అవుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం.. మీరున్నారా?

వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారిపై కుబేరుడి కృప ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అనుకోని ధనం చేతికి అందుతుంది. మీరు శుభవార్తలు వింటారు. 
కుబేరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే...
కుబేరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే... బంగారం, వెండి లేదా పంచలోహాలతో తయారు చేసిన కుబేరు యంత్రాన్ని స్థాపించి పూజలు చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.

Also Read: Second Surya Grahan 2023: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు? ఇది భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News