solar eclipse 2022 live updates: సూర్య గ్రహణం లైవ్ అప్‌డేట్స్.. ఎలా వీక్షించాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏయే రాశులపై ప్రభావం చూపిస్తుంది

solar eclipse 2022 live updates: సూర్య గ్రహణం.. ఖగోళ శాస్త్రవేత్తలకు ఎంత ఆసక్తికరమైన అంశమో... ఖగోళంలో జరిగే శాస్త్రీయపరమైన మార్పులు, పరిణామాలు గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు కూడా అంతే ఆసక్తికరమైన విషయం.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 01:51 PM IST
  • solar eclipse 2022 live updates: సూర్య గ్రహణం లైవ్ అప్‌డేట్స్.. ఎలా వీక్షించాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏయే రాశులపై ప్రభావం చూపిస్తుంది, సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం, 
solar eclipse 2022 live updates: సూర్య గ్రహణం లైవ్ అప్‌డేట్స్.. ఎలా వీక్షించాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏయే రాశులపై ప్రభావం చూపిస్తుంది
Live Blog

solar eclipse 2022 30th April live updates: సూర్య గ్రహణం.. ఖగోళ శాస్త్రవేత్తలకు ఎంత ఆసక్తికరమైన అంశమో... ఖగోళంలో జరిగే శాస్త్రీయపరమైన మార్పులు, పరిణామాలు గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు కూడా అంతే ఆసక్తికరమైన విషయం. అంతేకాదు... సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడిన సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయొచ్చు అనే విశ్వాసాలు ఉన్న వారు కూడా గ్రహణాలు ఏర్పడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలాంటి వారు కూడా గ్రహణాల కదలికలను, వాటి వల్ల కలిగే ప్రభావాలు, దుష్ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తుంటారు అనే సంగతి కూడా తెలిసిందే.

30 April, 2022

  • 13:48 PM

    How to watch solar eclipse online: నేటి పాక్షిక సూర్య గ్రహణం వీక్షించడం ఎలా ?
    వాస్తవానికి నేటి పాక్షిక సూర్య గ్రహణం భారత్‌లో కనిపించనప్పటికీ.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వారి ఆర్థోగ్రఫిక్ మ్యాప్ (orthographic map by NASA) ద్వారా ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లో ఈ సూర్య గ్రహణం వీక్షించేందుకు అవకాశం ఉంది.

  • 13:30 PM

    Surya Grahan Time in India: భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:15 గంటల నుంచి సాయంత్రం 4:07 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే, నేటి పాక్షిక సూర్య గ్రహణం భారత్‌లో కనిపించదనే విషయం గమనార్హం.

  • 13:24 PM

    How Solar Eclipse forms: భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని మనం సైన్స్ పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నదే.

  • 13:07 PM

    Solar Eclipses in 2022: 2022 ఏడాదిలో ఏర్పడే రెండు పాక్షిక సూర్య గ్రహణాల్లో ఈరోజు ఏర్పడుతున్న సూర్యగ్రహణం మొదటిది కాగా అక్టోబర్ 25న రెండో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది.

Trending News