Jupiter Asta 2023: దేవగురు బృహస్పతి ఈనెల చివరిలో అంటే మార్చి 28న మీనరాశిలో అస్తమించనున్నాడు. మళ్లీ అతడు ఏప్రిల్ 27న ఉదయించనున్నాడు. ఈలోపే ఏప్రిల్ 22న గురుడు మీనరాశిని విడిచిపెట్టి మేషరాశికి వెళతాడు. విద్య, సంతానం మరియు గౌరవానికి కారకుడిగా గురుడిని భావిస్తారు. బృహస్పతి అస్తమించడం వల్ల ఏ రాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపుతాయో తెలుసుకోండి.
మేష రాశి
గురుడు మేషరాశి రాశి యెుక్క 12వ ఇంట్లో అస్తమిస్తాడు. దీంతో మేషరాశి వారు ఆర్థిక, మానసిక మరియు శారీరక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కుటుంబంలో కలహాలు మెుదలవుతాయి. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో శ్రీహరిని పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
సింహ రాశి
దేవగురువు బృహస్పతి మీ రాశి నుండి 8వ ఇంట్లో అస్తమిస్తున్నాడు. దీంతో సింహరాశి వారిని అనేక వ్యాధులు చుట్టుముడతాయి. ఆర్థికంగా మీ పరిస్థితి దిగజారుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. అది విడాకులు వరకు దారితీయవచ్చు. ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
కుంభ రాశి
జ్యూపిటర్ కుంభరాశి యొక్క రెండవ ఇంటిలో సెట్ కాబోతుంది. దీని కారణంగా కుంభరాశి వారికి అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆర్థికంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోనే అవకాశం ఉంది.
Also Read: Guru Gochar 2023: రేర్ రాజయోగం చేస్తున్న బృహస్పతి.. ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook