Jupiter Retrograde: జూలై 29 నుంచి ఆ 4 రాశుల జాతకం పూర్తిగా మారిపోవడం ఖాయం, డబ్బేడబ్బు..

Jupiter Retrograde: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంది. శుభసూచకంగా భావిస్తారు. జూలై 29 న మీనరాశిలో వక్రమార్గం కానుండటంతో కొన్ని రాశులవారికి అంతులేని ధన సంపద, సుఖసంతోషాలు, ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం...

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2022, 05:53 PM IST
Jupiter Retrograde: జూలై 29 నుంచి ఆ 4 రాశుల జాతకం పూర్తిగా మారిపోవడం ఖాయం, డబ్బేడబ్బు..

Jupiter Retrograde: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంది. శుభసూచకంగా భావిస్తారు. జూలై 29 న మీనరాశిలో వక్రమార్గం కానుండటంతో కొన్ని రాశులవారికి అంతులేని ధన సంపద, సుఖసంతోషాలు, ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ రాశులకు అంతా అదృష్టమే..ఆ వివరాలు మీ కోసం...

హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా కొన్ని గ్రహాలు వక్రమార్గం చేస్తూ గోచారం చేస్తుంటాయి. ఫలితంగా కొన్ని రాశులకు శుభంగా, మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. జూలై 29వ తేదీన గురుడు మీనరాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. గురు గ్రహాన్ని శుభానికి సంకేతంగా భావిస్తారు. గురు గ్రహమంటే జ్ఞానం, విద్య, అదృష్టానికి ప్రతీకగా చెబుతారు. గురుడి వక్రమార్గం కారణంగా ఈ 4 రాశుల జాతకమే మారిపోనుంది. జూలై 29వ తేదీన గురుడు మీనరాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. ఫలితంగా కర్కాటకం, మకరం, సింహం, వృశ్ఛిక నాలుగు రాశులవారికి అంతులేని ధన సంపదలు, ఉద్యోగాలు, చదువు లభించనున్నాయి. గురుడు మీనరాశిలో ప్రవేశించడం మీనం, మిధున, మేషరాశివారికి కష్టాల్ని తెచ్చిపెడుతుంటే..మకరం, కర్కాటకం, వృశ్చికం, సింహ రాశులవారికి మాత్రం అంతులేని డబ్బు, ఉద్యోగావకాశాలు, తలపెట్టిన పనులు సజావుగా జరగడం..ఇలా అంతా సానుకూలంగా ఉండనుంది. 

మకరరాశి

జ్యోతిష్యం ప్రకారం మకరరాశి జాతకులకు విశేషలాభాలున్నాయి. ఈ సమయం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వెంట వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు, తోడ్పాటు లభిస్తుంది. సంపాదనకు కొత్త మార్గాలు కన్పిస్తాయి. హఠాత్తుగా ధనలాభముంటుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. 

కర్కాటకరాశి

ఈ రాశివారికి గురుడి వక్రమార్గం అదృష్టంగా మారనుంది. అదృష్టం పూర్తిగా కలిసివస్తుంది. ఉద్యోగాల్లో పదోన్నతి లభించడం, శుభవార్తలు వినడం ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి అత్యంత అనువైన సమయం.

వృశ్చికరాశి

జ్యోతిష్యం ప్రకారం ఈ రాశివారికి ఉద్యోగాల్లో వృద్ధి లభిస్తుంది. దాంతోపాటు ఆదాయం పెరుగుతుంది.కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే మంచి సమయం. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సజావుగా సాగడమే కాకుండా వెలకట్టలేని డబ్బు వచ్చి పడుతుంది. 

సింహరాశి

గురుడి వక్రమార్గం కారణంగా ఇది అత్యంత అనువైన సమయంగా ఉంటుంది. అంతులేని ధన సంపద లభిస్తుంది. వ్యాపారాలకు లాభాలు వస్తాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడి..జీవితం సుఖమయంగా ఉంటుంది. గురుడి వక్రమార్గం కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అన్నీ శుభాలే ఎదురౌతాయి. చదువు సంబందిత వ్యవహారాల్లో రాణిస్తారు. 

Also read: Tulsi Plant Precautions: తులసి మొక్క ఆకులు ఇష్టమొచ్చినట్టు కోయకూడదని మీకు తెలుసా, ఏం జరుగుతుంది

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News