Jupiter Retrograde 2024: బృహస్పతి గ్రహ తిరోగమనం.. ఈ రాశులవారికి సెప్టెంబర్‌లో పండగే.. ఊహించని డబ్బు సొంతం!

Jupiter Retrograde 2024 Effects: బృహస్పతి గ్రహ తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి సెప్టెంబర్‌లో బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ తిరోగమనం కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 29, 2024, 03:47 PM IST
 Jupiter Retrograde 2024: బృహస్పతి గ్రహ తిరోగమనం.. ఈ రాశులవారికి సెప్టెంబర్‌లో పండగే.. ఊహించని డబ్బు సొంతం!

Jupiter Retrograde 2024 Effects In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహానికి ప్రత్యేకమైన హోద ఉంటుంది. దీనిని భౌతిక సుఖంతో పాటు అదృష్టం, కీర్తికి సూచికగా భావిస్తారు. ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి విపరీతమైన ధన లాభాలతో పాటు గుడ్‌ న్యూస్‌ వింటారు. అదే ఈ గ్రహం ఉచ్చస్థితిలో ఉంటే తీవ్ర సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. బృహస్పతి ఒక రాశి నుంచి సొంత రాశికి రావడానికి దాదాపు 12 సంవత్సరాల పాటు సమయం పడుతుంది. 

బృహస్పతి గ్రహం సంచారం లేదా తిరోగమనం చేయడం వల్ల ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 9న బృహస్పతి తిరోగమనం చేయబోతోంది. ఈ గ్రహం ఫిబ్రవరి 4 తేది వరకు తిరోగమనంలో ఉండబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి. 

మిథున రాశి:
అక్టోబరు 9న జరిగే ఈ బృహస్పతి తిరోగమనం కారణంగా మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి ఉన్నట్లుండి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా డబ్బు కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే పిల్లలకు చదువుపై కూడా విపరీతమైన ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో పాటు మిథున రాశివారికి కొత్త ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టుబడులు కూడా పెడతారు. అలాగే వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు పొందుతారు. 

కర్కాటక రాశి:
ఈ తిరోగమనం కారణంగా కర్కాటక రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వీరికి న్యాయపరమైన చిక్కుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే అన్ని రకాల కోరికల నుంచి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు కొత్త డీల్స్‌ కుదుర్చుకుంటారు. దీంతో పాటు బుధుడి అనుగ్రహంలో ధనవంతులు కూడా అవుతారు. అలాగే కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. 

వృశ్చిక రాశి:
బృహస్పతి తిరోగమనంతో వృశ్చిక రాశివారికి ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. కెరీర్‌కు సంబంధించిన జీవితంలో అనేక రకాల విజయాలు కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు విద్యార్థులకు కూడా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు కొత్త కార్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆస్తులు కూడా పొందుతారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News