Guru Rahu Yuti 2023: 36 ఏళ్ల తర్వాత గురు-రాహువుల కలయిక.. వీరి జీవితం అల్లకల్లోలమే ఇక..

Jupiter Rahu Conjunction 2023: మేషరాశిలోకి బృహస్పతి రాకతో గురు చండాల యోగం ఏర్పడింది. దీనిని ఆస్ట్రాలజీలో అశుభకరమైన యోగం భావిస్తారు. ఇది ఏయే రాశులను ఇబ్బందులకు గురి చేస్తుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2023, 07:03 AM IST
Guru Rahu Yuti 2023: 36 ఏళ్ల తర్వాత గురు-రాహువుల కలయిక.. వీరి జీవితం అల్లకల్లోలమే ఇక..

Guru Chandal Yog effect: ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని చేంజ్ చేస్తోంది. ఆస్ట్రాలజీలో  ప్రకారం, ఒక రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. రీసెంట్ గా అంటే ఏప్రిల్ 22న బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే రాహువు అదే రాశిలో కూర్చుని ఉన్నాడు. ఈ రెండింటి కలయిక కారణంగా గురు చండాల యోగం ఏర్పడింది. ఈ ఆశుభకరమైన యోగం కొందరి జీవితాలను నాశనం చేయనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునరాశి - బృహస్పతి రాహువుల కూటమి మిథునరాశి వారిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. కుటుంబంలో గొడవలు చెలరేగుతాయి. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎందులోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు మంచివారి సలహా తీసుకోండి. 

మేషం - గురు చండాల యోగం మేషరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో మీకు ప్రతి పనిలో అడ్డంకులే ఎదురవుతాయి. పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయం కాదు. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే మీకే ఇబ్బంది. ఎవరితోనూ వాగ్వాదానికి దిగకండి, అది మీకే మంచిది. 

Also Read: Chandra Grahan 2023: మే 05న తొలి చంద్రగ్రహణం.. ఇది ఇండియాలో కనిపిస్తుందా?

కర్కాటక రాశి- ఈరాశి వారికి గురు రాహువు కూటమి చెడు ఫలితాలను ఇస్తుంది. మీకు ప్రతి రంగంలో అపజయమే ఎదురవుతుంది. మీ జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. మీపై శత్రువులు కుట్ర పన్నే అవకాశం ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసి రాదు. 

Also Read: Gajlaxmi Rajyog effect: మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు పట్టనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News