Guru Chandal Yog 2023: వచ్చే 7 నెలలపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Guru Chandal Yog 2023: మేషరాశిలో గురుడు, రాహువు కలయిక ఏర్పడబోతుంది. దీని వల్ల అశుభకరమైన యోగం రూపొందుతుంది. దీని వల్ల మూడు రాశులవారు నష్టపోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2023, 04:06 PM IST
 Guru Chandal Yog 2023: వచ్చే 7 నెలలపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా?

 Guru Chandal Yog 2023:  ప్రతి గ్రహం ఒక పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. హిందూ పంచాంగం ప్రకారం, దేవగురు బృహస్పతి ఈనెల 22న మేషరాశిలో సంచరించనున్నాడు. అప్పటికే దుష్ట గ్రహం రాహువు అదే రాశిలో తిష్ట వేసి కూర్చుంటాడు.  మేషరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో దీనిని అశుభకరమైనదిగా భావిస్తారు. ఇది ఏడు నెలలపాటు ఉంటుంది. ఈ అశుభకర యోగం వల్ల కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం- ఇదే రాశిలో గురు చండాల యోగం ఏర్పడుతుంది. దీంతో మేషరాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆఫీసులో ఈ సమయం అంతగా కలిసిరాకపోవచ్చు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. మీరు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. 
మిథునరాశి- గురు చండాల యోగం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఆఫీసులో మీ ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు వచ్చిన ప్రతి అవకాశం చేజారిపోతుంది. 
ధనుస్సు - గురు చండాల యోగం యొక్క అశుభ ప్రభావం ధనుస్సు రాశిపై కనిపిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మీ ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. మీరు ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. 

Also Read: Mangal Gochar 2023: కర్కాటక రాశి ప్రవేశం చేయనున్న కుజుడు.. ఈ 4 రాశులకు లాభాలు బోలెడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News