Horoscope January 18 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశివారు ధనలాభం పొందుతారు..

Horoscope Today: ఇవాళ సింహ రాశి వారికి అనుకూలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారు రాణిస్తారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 07:11 AM IST
  • నేటి(మంగళవారం) రాశి ఫలాలు
  • ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది
Horoscope January 18 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశివారు ధనలాభం పొందుతారు..

Horoscope Today: మనలో చాలా మంది ఈ రోజు ఏం జరగబోతుందనే దానిపై ఆసక్తి ఉంటుంది. అందుకే వారు రాశిఫలాలను అనుసరిస్తారు. జనవరి 18 (మంగళవారం) రాశి ఫలాలు (Horoscope Today) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:
ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృషభ రాశి:
ఈ రోజు ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

మిథున రాశి:
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొందరు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

Also read: Garuda puranam: గరుడ పురాణం రహస్యం.. ఇలాంటి వాళ్లకు లక్ష్మీ కటాక్షం చాలా ఉంటుందట..!!

కర్కాటక రాశి:
మనోధైర్యంతో ముందుకెళ్లాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు సానుకూలగా ఉంటాయి. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. 

సింహ రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారు రాణిస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ధన లాభం కలిగే అవకాశాలున్నాయి.

కన్య రాశి:
ప్రారంభించిన పనిలో సంతృప్తి ఉంటుంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. 

తుల రాశి:
ఓ వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి.

వృశ్చిక రాశి:
ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముందస్తుగా జాగ్రత్త పడటం మంచిది. చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనుస్సు రాశి:
తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి.

మకర రాశి:
శుభఫలాలు అందుతాయి. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

కుంభ రాశి:
చిత్తశుద్దితో పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారరాలలో లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. 

మీన రాశి:
ప్రారంభించిన పనులలో మంచి ఫలితాలు పొందుతారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News