Horoscope January 17 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు!

Horoscope Today: ఇవాళ ధనస్సు రాశి వారికి అనుకూలం. ఆకస్మిక ధనం లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 07:04 AM IST
  • నేటి(సోమవారం) రాశి ఫలాలు
  • ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
Horoscope January 17 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు!

Today's Horoscope January 17 2022:  మనం సాధారణంగా ఏదైనా పని లేదా శుభకార్యం మెుదలుపెట్టేటప్పడు ఆ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి  17వ తేదీ ) సోమవారం(Monday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకొనే సమయంలో తోటివారి సలహాలను తీసుకోవడం మంచిది.

వృషభ రాశి:  ఈరోజు ఈ రాశివారికి శారీరక శ్రమ ఎక్కువవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య దూరం రాకుండా చూసుకోండి. ఆలోచనలు స్థిరంగా ఉండేలా చూసుకోండి. తోటివారి సహకారం లభిస్తుంది.

మిధున రాశి:  ఈ రోజు ఈ రాశివారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు భయాందోళనలు విడిచి పెట్టాలి. మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. బంధువులతో సఖ్యంగా మెలగాలి.  వృత్తి ఉద్యోగాలపై శ్రద్ధ పెట్టి పనులు చేసుకోవాలి. వీరు ఆంజనేయ ఆరాధన చేస్తే మంచిది. 

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభఫలితాలున్నాయి. తమ నైపుణ్యంతో మంచి పేరు సంపాదించుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి పనులు చేపడతారు.

Also Read: Hanuman Photo Vastu: హనుమాన్ ప్రతిమ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటికే అరిష్టం!

కన్య రాశి: ఈ రాశివారికి బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. . కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. 

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. అప్పుల బాధలు ఎదురవుతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. తమకు హాని చేసేవారికి దూరంగా ఉంటే మంచిది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. శుభవార్త వింటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివావారు శారీరక శ్రమ లేకుండా పనులు పూర్తి అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.  కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. 

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అధిక ధన వ్యయం చేస్తారు. శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు.  కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News