Guru Gochar 2022: గురుగ్రహ సంచారం వల్ల ఈ 3 రాశులకు శుభకాలం!

Guru Gochar 2022: జ్యోతిషశాస్త్రంలో గురుగ్రహ సంచారం కారణంగా రాశీ చక్రంలోని అనేక రాశులకు మేలు జరుగుతుంది. ఈ ఏడాది గురుగ్రహం మీనరాశిలో సంచరిస్తున్న కారణంగా రాశీచక్రంలోని మూడు రాశుల వారికి మంచి జరగనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 11:39 AM IST
Guru Gochar 2022: గురుగ్రహ సంచారం వల్ల ఈ 3 రాశులకు శుభకాలం!

Guru Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని రాశుల వారికి బృహస్పతి సంచారం మేలు చేస్తుంది. గురుగ్రహం గతనెలలో మీనరాశిలోకి ప్రవేశించారు. ఏడాది పాటు ఇదే రాశిలో గురుడు కొనసాగుతాడు. అంటే 2023 ఏప్రిల్ వరకు మీన రాశిలో గురుగ్రహం కొనసాగుతుంది. దీని వల్ల రాశీ చక్రంలోని అనేక రాశుల వారికి శుభకాలం రానుంది. ఇంతకీ ఆ రాశుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభరాశి

బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే వృషభ రాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి. రాబోయే ఏడాది పాటు వృషభరాశి వారికి శుభకాలం నడవనుంది. వృషభరాశికి చెందిన వారిలో అనేక రంగాల వారికి శుభం కలుగుతుంది. ఆదాయంలో బలమైన పెరుగుదల ఉంటుంది. వచ్చే ఏడాది పాటు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ తీరనున్నాయి. ప్రేమ, వివాహ జీవితానికి కూడా అనుకూలంగా ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మార్గం సుగమం కానుంది. 

మిథునరాశి

మిథునరాశి వారికి రాబోయే ఏడాది కాలం వృత్తి - వ్యాపారాలలో చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. మీడియా, మార్కెటింగ్ రంగాల్లో పని చేసే వారికి పెద్ద ప్రయోజనం ఉంటుంది. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ సమయం అదృష్ట కాలం నడుస్తోంది. ఈ రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించినది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)

Also Read: Horoscope Today May 11 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి...

Also Read: May Month Born: మే నెలలో జన్మించిన వ్యక్తులు తప్పకండా ఇవి తెలుసుకోండి..అమ్మాయిలు ఈ రంగంలో చాలా విజయాలు సాధిస్తారు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News