Karthika Masam 2022: హిందువులకు ఇష్టమైన మాసం కార్తీకం. ఈ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు భగవంతుడిని పూజించి..దానధర్మాలు చేస్తే పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. కార్తీక సోమవారం (Karthika Somavaram 2022) నాడు మహిళలు ఉపవాసం ఉండి శివారాధన చేస్తారు. దీంతో వారికి మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. సోమవారం సూర్యోదయానికి ముందు బ్రహ్మీముహూర్తంలో స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల మీరు నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని నమ్ముతారు.
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ఇవాళ శివాలయాలన్నీ తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్తీక మాసం సందడి మామూలుగా లేదు. ముఖ్యంగా ఏపీలోని ప్రముఖ క్షేత్రాలన్నింటికీ భక్తులు పోటెత్తుతున్నారు. పంచరామం, అమరాశ్వేరాలయం, ద్రాక్షరామ భీమేశ్వరాలయం, అన్నవరం సత్యనారాయణ ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. ఆలయాలన్నీ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. ద్రాక్షారామం శ్రీమాణిక్యాంబ ఆలయాన్ని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సతీసమేతంగా సందర్శించి పూజలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook