Budh Rashi Parivartan in Tula Rashi: బుధుడిని జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహం పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం పడుతుంది. ఈ గ్రహం ప్రత్యేక సమయంలో మాత్రమే రాశి సంచారం చేస్తూ ఉంటుంది. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం, బుధుడు అక్టోబర్ 19 ఉదయం 01:16 గంటలకు తులారాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మొత్తం 12 రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే క్రమంలో బుధుడు అక్టోబర్ 22న స్వాతి నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిథున రాశి:
మిథున రాశి బుధ గ్రహం పాలిస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి బుధుడు తులారాశిలో సంచారం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. నిలిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. అంతేకాకుండా మీరు ఈ సమయంలో భూమి, భవనాలు, వాహన కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్‌లో మంచి ప్రయోజనాలు పొందుతారు.
కన్యారాశి:
కన్యారాశి వారికి బుధుడు సంచారం చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సంచారం వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కష్టపడి పనులు చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ధనుస్సు రాశి:
బుధగ్రహం సంచారం కారణంగా ధనుస్సు రాశివారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో ఊహించని ఫలితాల పొందుతారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మకర రాశి:
మకర రాశి వారికి బుధుడి సంచారం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రుల మద్ధతు లభించి మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు వీరు పూర్వీకుల ఆస్తిని కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..