Chandra Grahan Yoga effect: ఇవాళే చంద్రగ్రహణం. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు తులరాశిలో సంచరించనున్నాడు. అదే రాశిలో ఇప్పటికే కేతు గ్రహం కూర్చుని ఉన్నాడు. రాహువు మరియు కేతువు కారణంగా అశుభకరమైన చంద్రగ్రహణ యోగం ఏర్పడుతోంది. సాధారణంగా చంద్రుడు మనస్సుకు కారకుడిగా భావిస్తారు. చంద్రగ్రహణ యోగం కారణంగా మీ మానసిక స్థితి ప్రభావితం అవుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి సమస్యలు ప్రారంభంకానున్నాయి.
మేష రాశి
చంద్రగ్రహణ యోగం కారణంగా మీరు వైవాహిక జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూస్తారు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ పనులన్నీ ఆగిపోవచ్చు. మీ కెరీర్ సందిగ్ధంలో పడవచ్చు.
వృషభ రాశి
చంద్ర-కేతు కలయిక వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ శత్రువులు మీపై విజయం సాధించవచ్చు. దాంపత్య జీవితంలో సమస్యలు రావచ్చు. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఈ సమయం అస్సలు కలిసిరాదు.
తులా రాశి
చంద్ర-కేతు సంయోగం మీ కుటుంబంలో విభేదాలు తలెత్తేలా చేస్తుంది. మీరు మీ వివాహం కోసం మరికొంత కాలం వేచిచూడాల్సి వస్తుంది. మిత్రుల మధ్య గొడవలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. మీ కెరీర్ లో అనేక సమస్యలు వస్తాయి.
Also Read: Venus transit 2023: శుక్రుని సంచారంతో ఈ 3 రాశుల జీవితాల్లో కీలక మార్పులు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook